Ads
యాంకర్ మరియు నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అనసూయకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.
Video Advertisement
తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన వీడియోని వైరల్ గా మారింది. అనసూయ ఈ వీడియోలో ఏడుస్తూ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు అనసూయ పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు. నటి శ్రీరెడ్డి తాజాగా ఈ వీడియో పై స్పందించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అనసూయ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియో షేర్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం చర్చకు దారి తీసింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాక, నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ తరువాత అనసూయ ఆ వీడియో గురించి మాట్లాడుతూ మళ్ళీ ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే అప్పటికీ ఆమె ఎందుకు ఏడుస్తుందో క్లారిటీగా రాలేదు. ఈ క్రమంలోనే నటి శ్రీ రెడ్డి అనసూయ వీడియో పైన ట్విట్టర్ వేదికగా స్పందించింది.
శ్రీరెడ్డి తన ట్వీట్ లో ” అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా. ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు, పాపం అవి తనని బాగా బాధిస్తున్నాయి.
నా పోస్ట్ లకు కూడా, చాలా మంది దరిద్రమైన కామెంట్స్ పెడుతున్నారు, తప్పురా అలా చెయ్యకూడదు, మంచిగా ఉందాం” అంటూ రాసుకొచ్చింది. ఆ తరువాత మళ్ళీ కాసేపటికి శ్రీరెడ్డి అనసూయ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ, “అబ్బా కమల్ హసన్… ఇలాంటి కథలు పడిద్ది అని నాకు తెలుసు, అందుకే ఆంటీ అన్నది” అంటూ ట్వీట్ చేసింది.
https://twitter.com/MsSriReddy/status/1692873517585625205
End of Article