సినిమాలు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులని వెంటాడుతూనే ఉంటాయి.

Video Advertisement

ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలా ఇటీవల వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి. కన్నడ సినిమా అయిన ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి.

sapta sagaralu dhaati side a movie review

ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించారు. సినిమా చాలా సహజంగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా హీరో హీరోయిన్ల ప్రేమ కథ అయితే చాలా మందికి కనెక్ట్ అయ్యేలాగా తీశారు. అంతే కాకుండా ఈ సినిమాలో జైలుకి సంబంధించి చాలా సీన్స్ ఉంటాయి. అవి కూడా చాలా రియలిస్టిక్ గా రాసుకున్నారు అని దర్శకుడు ఒక సందర్భంలో చెప్పారు.

sapta sagaralu dhaati side a movie review

ఇందులో హీరో ఎదుర్కొనే సంఘటనలు చూస్తూ ఉంటే ప్రేక్షకులకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమాలోని ఒక సీన్ కి మాత్రం హీరో నటనకి చప్పట్లు పడ్డాయి. అసలు ఈ సీన్ చేయడానికి ఏ స్టార్ హీరో కూడా ధైర్యం చేయడు ఏమో అని అన్నారు. అందులోనూ ముఖ్యంగా మన తెలుగు హీరోలు అయితే అస్సలు ఇలాంటివి చేయలేరు ఏమో అన్నారు. ఈ సినిమాలో హీరో ఒక సందర్భంలో టాయిలెట్ కడగాల్సి వస్తుంది.

sapta sagaralu dhaati side a movie review

సాధారణంగా ఇలాంటి సీన్ చూడటానికే ప్రేక్షకులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందులోనూ ఈ సీన్ చాలా రియల్ గా తీశారు. ఆ సీన్ లో ఉండే వాతావరణం అంతా చూస్తూ ఉంటే నిజంగా ఒక శుభ్రంగా లేని టాయిలెట్ లోకి హీరో వెళ్లి కడుగుతున్నట్టే అనిపిస్తుంది. అయితే ఈ సీన్ చూశాక రక్షిత్ శెట్టి మీద చాలా మందికి ఇంకా గౌరవం పెరిగింది. నటుడు అన్నాక తన పాత్ర కోసం ఎలాంటి పని అయినా చేయాల్సి వస్తుంది. అది నిజమే. కాకపోతే స్టార్ హీరో అయ్యాక వాళ్ళకి ఉండే కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని రిస్క్ లు తీసుకోలేరు.

sapta sagaralu dhaati side a movie review

ఒక సమయంలో రిస్క్ చేసే సీన్స్ చేసిన హీరోలు, స్టార్ హీరో అయ్యాక వారి ఫ్యాన్స్ మనోభావాలు అర్థం చేసుకొని, వారు ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటివి చేయటానికి ధైర్యం చేయరు. అందులోనూ ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో హీరోలని ఎంతగా అభిమానిస్తామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మన హీరోలు రిస్క్ చేయడం అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. దాంతో ఈ సీన్ చూసిన తర్వాత చాలా మంది ఇలాంటి ఒక సీన్ చేసే ధైర్యం ఒక స్టార్ తెలుగు హీరో, అది కూడా ఈ జనరేషన్ లో ఉన్న తెలుగు స్టార్ హీరో చేయగలుగుతాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : “ఆడ నెమలి” పాటతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?