RRR అంత హిట్ అయినా కూడా వీళ్ళకి ఎందుకు అంత కోపం..? వైరల్ అవుతున్న కామెంట్స్..!

RRR అంత హిట్ అయినా కూడా వీళ్ళకి ఎందుకు అంత కోపం..? వైరల్ అవుతున్న కామెంట్స్..!

by Anudeep

Ads

బాహుబలి సినిమా ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనేట్టు ఉండేది. కానీ ఏ ముహూర్తాన రాజమౌళి బాహుబలి సినిమాకి శ్రీకారం చుట్టాడో అప్పుడే ఒక్కసారిగా టాలీవుడ్ స్ధితి, గతి పూర్తిగ మారిపోయింది.

Video Advertisement

తెలుగు సినిమా ఖ్యాతి దేశం దాటి ప్రపంచవ్యాప్తం అయ్యింది. అప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే మేమే అని చెప్పుకునే బాలీవుడ్ ప్రముఖులకు, ప్రేక్షకులకు బాహుబలితో షాక్ ఇచ్చాడు జక్కన్న. ఆ షాక్ నుండి తెరుకోకముందే బాహుబలి 2 తో మరొకసారి తెలుగు సినిమా సత్తా అంతర్జాతీయంగా చాటి, బాహుబలి విజయం గాలివాటం కాదని నిరూపించాడు.

ఆ రెండు సినిమాల తర్వాత రాజమౌళి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తన తర్వాత సినిమా రామ్ చరణ్,  ఎన్. టి.ఆర్ తో RRR అనౌన్స్ చేసి మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

RRR సినిమాలో చరణ్ ని అల్లూరి సీతా రామరాజు గాను, ఎన్. టి.ఆర్ ని కొమరం భీం గాను చూపిస్తూ జక్కన్న తన మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లతో భారతీయ సినీ ప్రేక్షకుల్ని కట్టి పడేసాడు. అత్యద్భుతమైన కధ, కథనాల తో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని అలరించింది.

చరణ్ ని అయితే భారతీయ సినీ అభిమానులు శ్రీరాముడి గా అభివర్ణిస్తూ కీర్తించడం జరిగింది. ఇంటర్వల్ ముందు తారక్ ఎంట్రీ, కొమరం భీముడొ సాంగ్ లో భావోద్వేగాలు పలికించిన తీరు కి, తారక్ కి కూడా ఈ సినిమా తో దేశ వ్యాప్తం గా అభిమానులు ఏర్పడ్డారు.ఈ సినిమా తో చరణ్, తారక్ లని జక్కన్న పాన్ ఇండియా హీరోలు గా నిలబెట్టడం జరిగింది.

comments on rrr result goes viral

రాజమౌళి విజయాల్ని బాలీవుడ్లో కొంత మంది ప్రముఖులతో పాటు, బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అంగీకరించలేకపోతున్నారు. అందుకే  RRR సినిమాని ట్విటర్లో ఒక చానల్ ఇచ్చిన రివ్యూలో ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా పేర్కొంటే బాలీవుడ్ నెటిజన్లు ఆ రివ్యూ మీద నెగెటివ్ విమర్శలు చేస్తున్నారు.

comments on rrr result goes viral

RRR సినిమాకి ఆ స్ధాయి లేదు అని, ఓవర్ హైప్ ఇవ్వడం వల్లనే సినిమా హిట్ అయింది అని, సినిమా కంటెంట్ సరిగా లేదు అంటూ బాలీవుడ్ సినిమా జనాలు ఈ సినిమాపై వారి వ్యతిరేకతని ట్విటర్ లో బాహాటం గానే వ్యక్తం చేస్తున్నారు.

comments on rrr result goes viral

అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం, బాలీవుడ్ థియేటర్స్ మీద దండయాత్ర చేస్తున్న రాజమౌళి సినిమాల మీద వారికి ఆ మాత్రం కడుపు మంట సహజం అని, భవిష్యత్ లో కూడా రాజమౌళి తెలుగు సినిమాని బాలీవుడ్ కంటే ఉన్నత స్ధితిలో ఉంచే అద్భుతమైన సినిమాలు చేస్తాడని వారి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like