సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలను దేవుళ్లుగా చూస్తూ.. వారికీ నచ్చేనందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు టెక్నిషియన్లు. అందుకే వీలు కుదిరినప్పుడల్లా వారిని పొగడటమే పనిగా పెట్టుకుంటారు. ముఖ్యం గా సినిమా ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరోల మీద చేసే భజనలు, కీర్తనలు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. కొందరు వారి మీద అవాజ్యమైన ప్రేమని కురిపిస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే తాజాగా చెన్నై లో విజయ్ ‘ వారిసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకుడు. ఆ ఫంక్షన్ లో నిర్మాత దిల్ రాజు విజయ్ సూపర్ స్టార్, అతడే నెంబర్ వన్ అని చెప్పాడు. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న కూడా తలపతి విజయ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని అని చెప్పింది. సంగీత దర్శకుడు తమన్ కూడా అదే పంథా ని కొనసాగిస్తూ తాను విజయ్ కి లైఫ్ టైం అభిమానిని అని చెప్పాడు. అయితే ఈ విషయం పై నెటిజన్లకు అడ్డం గా దొరికి పోయాడు తమన్. నిర్మాతని, హీరోయిన్ ని వదిలేసి తమన్ ని టార్గెట్ చేసారు ట్రోలర్స్.
trolls on thaman tweets..!!

తమన్‌ ఈ మధ్య స్టార్ హీరోలందరితోనూ పని చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇలా అందరితోనూ పని చేశాడు. అయితే ఈ సినిమాల సమయంలో తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. చిరు తో పని చేసేటపుడు చిరు ఫ్యాన్ ని అని ట్వీట్ చేసాడు తమన్, అలాగే పవన్ తో పని చేసినపుడు కూడా ట్వీట్ చేసాడు. తర్వాత తాను తమిళ్ హీరో అజిత్ కి పెద్ద ఫ్యాన్ ని అని.. అతడితో పని చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేసాడు. ఇప్పుడు విజయ్ గురించి కూడా లైఫ్ టైం ఫ్యాన్ ని అంటూ ట్వీట్ చేయడంతో నెటిజన్లు తమన్ పై ట్రోల్స్ ఎక్కుపెట్టారు.

trolls on thaman tweets..!!

అతడు గతం లో చేసిన ట్వీట్స్ అన్ని తీసి.. అందరికీ ఫ్యాన్‌వా నువ్వు.. ఎందుకు ఇలా ఓవర్‌గా మాట్లాడతావ్‌.. అంటూ తమన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం తమన్ బాలకృష్ణ ‘వీర సింహ రెడ్డి’, విజయ్ ‘ వారసుడు’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రాల్లోని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.