“టిల్లు స్క్వేర్” సినిమాలో ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..? ఇలా చేయకపోయి ఉంటే..?

“టిల్లు స్క్వేర్” సినిమాలో ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..? ఇలా చేయకపోయి ఉంటే..?

by Harika

Ads

సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎన్నో సార్లు వాయిదా పడి ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. మధ్యలో రీ షూట్స్ కూడా జరిగాయి అని సమాచారం. సినిమా బృందం మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయితే అయ్యిందో, ఇది కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో కష్టపడి స్క్రిప్ట్ ని అంత బాగా రాసుకొని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళ కష్టం అంతా కూడా తెర మీద తెలుస్తోంది.

Video Advertisement

tillu square movie review

సాధారణంగా, సినిమాలు ఇన్ని సార్లు వాయిదా వేస్తే, ఇంటర్వ్యూస్ లో కూడా టీం సినిమా కథ ఎక్కువగా చెప్పకపోతే ప్రేక్షకులకు సినిమా ఎలా ఉండబోతోంది అనేది అర్థం కాలేదు. కొంత మంది అయితే, కంటెంట్ బలహీనంగా ఉంది ఏమో, మళ్లీ షూట్స్ చేస్తున్నారు ఏమో అని అనుకున్నారు. కానీ ఇవాళ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒక మంచి ఎంటర్టైనర్ సినిమాని బృందం ప్రజెంట్ చేశారు. అయితే ఈ సినిమాలో రెండు విషయాల మీద కామెంట్స్ వస్తున్నాయి.

అందులో మొదటిది, హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్. సినిమాలో లవ్ సీన్స్ అనేది ఉంటాయి అని మనకి ట్రైలర్ చూస్తే అర్థం అయ్యింది. కానీ ఇందులో అవి మోతాదుకి మించి ఎక్కువగా ఉన్నాయి. అసలు కొన్ని చోట్ల అయితే అలాంటి సీన్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఏమో అనిపించింది. కాబట్టి అవి కాస్త ఎడిట్ చేసి ఉంటే బాగుండేది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరొకటి, మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది.

tillu square movie review

అక్కడి వరకు బాగానే ఉంది. ఈ సినిమా కూడా అదే టెంప్లేట్ మీద తీశారు. కానీ మొదటి భాగానికి సంబంధించి చాలా రిఫరెన్స్ లు ఇందులో వాడారు. కొన్ని సార్లు అవి నవ్వొచ్చినా కూడా, కొన్ని సార్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఏమో అనిపించాయి. అందుకే ఈ రెండు విషయాల మీద మాత్రం సినిమా బృందం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అని అన్నారు. అయినా కూడా సినిమాలో మెచ్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది.

ALSO READ : అల్లు అర్జున్ కి, ఆయన భార్య స్నేహారెడ్డికి మధ్య ఎన్ని సంవత్సరాల తేడా ఉందో తెలుసా..? స్నేహా ఎప్పుడు పుట్టారంటే..?


End of Article

You may also like