Ads
చలికాలంలో సాధారణంగా జలుబు వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒమీక్రాన్ కేసులు పెరిగిపోవడంతో సాధారణ జలుబు వచ్చినా కూడా మనలో టెన్షన్ మొదలవుతోంది. అయితే అది సాధారణ జలుబా లేదు అంటే ఒమీక్రాన్ ఆ అనేది ఎలా తెలుసుకోవాలి. ఆరోగ్య నిపుణులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతుండడంతో ఆందోళన మొదలు అయ్యింది. అయితే ఒమీక్రాన్ లక్షణాలకి, సాధారణ జలుబు లక్షణాలుకి తేడాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే అస్సలు భయపడక్కర్లేదు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉన్నా, సీరియస్ గా అనిపించినా సరే కరోనా టెస్ట్ చేయించుకోండి. అంతే కానీ అస్సలు అజాగ్రత్తగా ఉండదు. ఇక ఒమీక్రాన్ లక్షణాలకి, సాధారణ జలుబు యొక్క లక్షణాలు కి మధ్య తేడా చూద్దాం.
ఒమీక్రాన్ లక్షణాలు:
- అలసట
- కీళ్ల నొప్పులు
- చలి వేయడం
- తల నొప్పి కలగడం
- గొంతు నొప్పి
సాధారణ జలుబు లక్షణాలు:
- నార్మల్ జలుబులో ముక్కు కారుతూ ఉంటుంది.
- అలాగే కాస్త తలనొప్పి వస్తుంది.
- తుమ్ముల భారంతో ఎక్కువ నొప్పి తలలో ఉంటుంది.
- వేడి పదార్థాలు తాగాక ఉపశమనం లభిస్తుంది.
- కేవలం తలపై తప్ప ఇంక ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండదు.
- నార్మల్ గా జలుబు వస్తే గొంతు నొప్పి రాదు.
- ముక్కు లోపల పొడి లేదా జలదరింపు లాంటిది ఉంటుంది.
- చికాకుగా ఉంటుంది కానీ అలసట ఉండదు.
అలానే కరోనా మహమ్మారి సమయంలో గొంతు లేదా ముక్కు ద్వారా ఊపిరితిత్తుల పై దాడి చేసేది. కాని ఒమీక్రాన్ వైరస్ లో అలా కాదు. ఊపిరితిత్తులను సజీవంగా ఉంచుతుంది. ఎలాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉండవు. ఒమీక్రాన్ వస్తే ఆక్సిజన్ లెవెల్స్ ఏ మాత్రం తగ్గవు.
End of Article