జెనీలియా నటించిన ఈ 4 సినిమాలలో కామన్ పాయింట్ ఏంటో గమనించారా..?

జెనీలియా నటించిన ఈ 4 సినిమాలలో కామన్ పాయింట్ ఏంటో గమనించారా..?

by Anudeep

Ads

జెనీలియా తెలుగు వారికి బాగా సుపరిచితురాలు అయిన నటి. “బొమ్మరిల్లు” లో హాసిని గా నటించి నవ్వించిన జెనీలియా ను ఎవరైనా అంత తొందరగా మర్చిపోగలరా..? జెనీలియా.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్నాక.. మారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Video Advertisement

ఒకప్పుడు యూత్ అంతా కూడా ఎంతగానో ఇష్టపడిన హీరోయిన్ జెనీలియా.చిన్నపిల్లలా చాలా క్యూట్ గా ఉంది అంటూ అమ్మాయిలు కూడా జెనీలియా స్టైల్ ను అనుసరించేవాళ్ళు.సత్యం చిత్రం తో టాలీవువుడ్ కు పరిచయం అయ్యారు జెనీలియా.కాగా తెలుగు లో కొంతమంది స్టార్ హీరోలతో నటించారు జెనీలియా.తరువాత పలు బాలీవుడ్ హిట్ చిత్రాలలో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు జెనీలియా.

ఇక తెలుగులో కూడా జెనీలియా చాలా సినిమాలే చేసారు. బొమ్మరిల్లు, ఢీ, రెడీ, శశిరేఖా పరిణయం వంటి సినిమాలు జెనీలియా కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ఆరంజ్ సినిమాలో కూడా రామ్ చరణ్ సరసన అలరించిన జెనీలియా.. ఈ సినిమాతో అంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. ఇది ఇలా ఉంటె.. జెనీలియా నటించిన ఢీ, రెడీ, శశిరేఖా పరిణయం, నా ఇష్టం సినిమాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ నాలుగు సినిమాల్లోనూ జెనీలియా పెళ్ళికి ముందే ఇంట్లోంచి వెళ్లిపోయే క్యారక్టర్ లో నటించారు. శశిరేఖా పరిణయంలో సడన్ గా పెళ్లి అని చెప్పేసరికి.. అది ఒప్పుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోతారు. రెడీ సినిమాలో.. తన మేనమామలు తన ఆస్తి కోసం బలవంతపు పెళ్లి చేయడం ఇష్టం లేక హీరోతో వెళ్ళిపోతారు. ఇక ఢీ సినిమాలో తన అన్నయ్యకి తెలిస్తే ఒప్పుకోడు అన్న కారణంతో రహస్యంగా పెళ్లి చేసేసుకుంటారు. ఆ తరువాత అన్నని కూడా ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. నా ఇష్టం సినిమాలో కూడా అలానే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఈ నాలుగు సినిమాల్లోనూ ఇదే కామన్ పాయింట్.


End of Article

You may also like