కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్లు ఏవనే ప్రశ్నకు సమాధానంగా అతనొక్కడే, పటాస్, బింబిసార సినిమాల పేర్లు వినిపిస్తాయి. ఇప్పటికే 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్ల తో బింబిసార సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.ఫుల్ రన్ లో ఉన్న ఈ సినిమా కచ్చితంగా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది.
తాజా హిట్ తో కలిపి కళ్యాణ్ రామ్ తన కెరీర్లో హిట్ కొట్టిన అతనొక్కడే, పటాస్ సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Video Advertisement

అసలు ఆ పాయింటు ఏంటి అనే విషయానికి వస్తే……అతనొక్కడే సినిమాలో కళ్యాణ్ రామ్ మొదట కొందరు విలన్లని చంపుతూ మిగిలిన విలన్ల కు భయం కలిగేలా చేస్తారు. కళ్యాణ్ రామ్ ఆ విధంగా చేయడానికి గల కారణం ఫ్లాష్ బ్యాక్ లో వెలుగులోకి వస్తుంది. ఆ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ ఒక పాజిటివ్ పాయింట్ అయ్యింది. అలాగే ఈ బింబిసార సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో కూడా కళ్యాణ్ రామ్ వయెలెంట్ గా కనిపించారు. హరేరామ్ చిత్రంలో కూడా…రామ్ పాత్రలో నెగటివ్ షేడ్ లో నటించారు కళ్యాణ్ రామ్.

పటాస్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రారంభంలో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసు పాత్రతో పరిచయమయ్యారు. అయితే ఆ తర్వాత మార్పు వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా మెప్పించి ఆద్యంతం అలరించారు. నిజ జీవితంలో ఎంతో మంచి వ్యక్తి అయిన కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో క్రూరమైన రాజు పాత్రలో కనిపించి ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు సినిమాలో కూడా మొదట హీరో అహంభావంతో ప్రవర్తించి తర్వత తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల వల్ల మారడం గమనార్హం.

బింబిసార సక్సెస్ తో కళ్యాణ్ రామ్ ఎటువంటి పాత్రనైనా సహజంగా నటించి మెప్పించగలరని మరొకసారి ప్రూవ్ అయ్యింది . తన కెరీర్ లో బారి సక్సెస్ సాధించిన ఈ మూడు సినిమాలలో కామన్ గా కళ్యాణ్ రామ్ మొదట నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. ఈ తరహా పాత్రలు కళ్యాణ్ రామ్ కు కలిసొస్తున్నాయని నెట్టింట అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ విజయంతో కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగాయి. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం డైరెక్టన్లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న డెవిల్ సినిమాకు శ్రీకాంత్ విస్సా కథ అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కోరుకున్న విజయాన్ని అందిస్తుందో లేదో వెండితెరపైనే చూడాలి.మరోవైపు కళ్యాణ్ రామ్ త్వరలో బింబిసార కు సీక్వెల్ సినిమా కు సంబందించిన షూటింగ్ లో పాల్గొననున్నారు.