టాలీవుడ్ హీరోయిన్లు సమంత, నిధి, పూజ హెగ్డే లు అందరికి సుపరిచితులు. అయితే.. వీరిద్దరి మధ్య ఎటువంటి బాండ్ ఉందా..? అని ఆలోచిస్తున్నారా..? వీరు ముగ్గురికి ఓ కామన్ పాయింట్ ఏంటి అంటే.. వీరు ముగ్గురు ఒకే హీరో తో తెరంగ్రేటం చేసారు. ఎవరో తెలుసు కదా.. మన అక్కినేని వారసుడు నాగ చైతన్య. నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు.

naga chaitanya 1

“ఏ మాయ చేసావే” సినిమా తో నాగ చైతన్య సమంతను టాలీవుడ్ కి పరిచయం చేసారు. ఆ తరువాత వీరి పరిచయం ప్రేమ గా మారి.. పెళ్లి వరకు దారితీసింది. ఆ తరువాత వీరిద్దరూ. ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’, ‘మనం’ సినిమాలలో కూడా కలిసి నటించారు. నాగార్జున పలువురు హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసారు. “జోష్” సినిమా తో కార్తీక ను, “బెజవాడ” సినిమా తో అమలాపాల్ ను కూడా తెలుగు తెరకు పరిచయం చేసారు.

naga chaitanya 2

“ఒక లైలా కోసం” సినిమా తో నాగ చైతన్య పూజ హెగ్డే ను తెలుగు తెరకి పరిచయం చేసారు. ఆ సినిమాలో వీరిద్దరూ జంట గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే “సాహసం శ్వాసగా సాగిపో” సినిమాతో మంజిమ మోహన్ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. తెలుగు “ప్రేమమ్” సినిమా తో సెబాస్టియన్ కూడా తెలుగు వారికి పరిచయమయ్యారు. ఇక “సవ్యసాచి” సినిమా తో నిధి అగర్వాల్ కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే.