వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తర్వాత వంశీ బృందావనం, ఎవడు, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసాడు. వీటిలో మహేష్ తో చేసిన మహర్షి సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వంశి పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసాడు. దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న వారసుడు సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Video Advertisement

అయితే విజయ్ వారసుడు ట్రైలర్ చూసిన తర్వాత లక్ష్మీ, మహర్షి, శ్రీమంతుడు, అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం ఇలా అన్ని సినిమాలు గుర్తుకు వస్తున్నాయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ముగ్గురు కొడుకులు.. మధ్యలో గొడవలు.. దూరం చేసే ఓ విలన్.. కాపాడే చిన్న తమ్ముడు.. ఉమ్మడిగా ఉంచేందుకు చేసే ప్రయత్నాలు.. ఇలాంటి నాటు కొట్టుడు కథలు, సినిమాలను మన తెలుగు వాళ్లు ఇది వరకే ఎన్నో చూసి ఉన్నారు. మరి ఈ వారసుడు సినిమా ఎలాంటి టాక్‌ను తెచ్చుకుంటుందో చూడాలి.

common point in vamsi pydipally movies..

ఇప్పుడు ఈ సినిమా సంగతి పక్కన పెడితే వంశి పైడిపల్లి మొదటి నుంచి చేస్తున్న చిత్రాలను గమనిస్తే మనకు కొన్ని విషయాలు కామన్ గా అనిపిస్తాయి.

#1 ఈయన తీసే సినిమాల్లో మెయిన్ గా ఫామిలీ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్లు ఇలాంటి రిలేషన్స్ ని హైలైట్ చేస్తారు ఆయన సినిమాల్లో.

minus points in varisu movie trailer

#2 అలాగే హీరోకి తల్లి సెంటి మెంట్ ఉన్నట్లు ఆయన ప్రతి సినిమాలో చూపించారు. ఇంకా బృందావనం సినిమాలో అయితే హీరోయిన్ కాజల్ కి కూడా తండ్రి సెంటిమెంట్ ఉన్నట్టు చూపించారు.

common point in vamsi pydipally movies..

#3 అలాగే ఈయన సినిమాల్లో హీరో పాత్ర విషయానికి వస్తే అంత బాధ్యతగా లేని కుర్రాడికి అనుకోని సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కొంటాడు అనేదే ఎక్కువగా ఉంటుంది.

dil raju making best plans for varisu business

#4 ఇక నటీనటుల విషయానికి వస్తే ఆయన ప్రతి సినిమాలోనూ జయసుధ, ప్రకాష్ రాజ్ ఇద్దరిలో ఒకరు ఖచ్చితం గా ఉంటూ వస్తున్నారు. వంశీ పైడిపల్లి మొదటి సినిమా అయినా మున్నా సినిమా లో జయసుధ నటించలేదు. అలాగే రామ్ చరణ్ తో వచ్చిన ఎవడు సినిమాలో ప్రకాష్ రాజ్ లేరు. కానీ మిగిలిన సినిమాల్లో మాత్రం ఈ ఇద్దరు నటీనటులు కచ్చితంగా ఉంటారు.

minus points in varisu movie trailer

వీటిని చూసిన నెటిజన్లు వంశీ పైడిపల్లి ప్రయోగాల జోలికి పోకుండా.. తనని నమ్ముకున్న హీరో, నిర్మాతలని సేఫ్ చేసేందుకు తన సినిమాలన్నీ సేఫ్ జోన్ లోనే తీస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.