బీపీతో బాధపడుతున్నారా..? అయితే మందులు లేకుండా ఇలా కంట్రోల్ చేసుకోండి..!

బీపీతో బాధపడుతున్నారా..? అయితే మందులు లేకుండా ఇలా కంట్రోల్ చేసుకోండి..!

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో బీపీ ఒకటి. జీవన శైలి, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు కారణంగా ఎంతో మంది హైబీపీకి గురవుతున్నారు. దీనిని కంట్రోల్ చేయడానికి రెగ్యులర్ గా మందులు కూడా వాడుతూ ఉంటారు. ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు సహజసిద్ధంగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.

Video Advertisement

అయితే నేచురల్ గా మందులు వాడకుండానే హై బీపీని కంట్రోల్ చేయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా అనుసరిస్తే తప్పక బీపీ తగ్గుతుంది.  బీపీని తగ్గించడానికి ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. అలానే ఉప్పుని రోజు తగ్గించాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి.

ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినడం వల్ల బీపి 7 పాయింట్లు తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ ఆహారం మొక్కలు ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి.
తక్కువ మాంసాన్ని తీసుకోవడం, ఎక్కువ మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకుంటే 11 పాయింట్ల దాక బీపీ తగ్గుతుంది.
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటే ఐదు పాయింట్లు బీపీని తగ్గించుకోవచ్చు.


బరువు తగ్గడం వల్ల కూడా బీపీని తగ్గించుకోవచ్చు.
సోడియంను తగ్గించడం వల్ల 15 పాయింట్లు వరకు బీపీ తగ్గుతుంది.
కనీసం 3 నెలల పాటు ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల 9 పాయింట్లు తగ్గించవచ్చు.


ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం, ఉప్పుని తగ్గించడం వల్ల 18 పాయింట్లు తగ్గుతుంది.
ఉపవాసం చేసి కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటే 37 పాయింట్ల వరకు తగ్గుతుంది. కానీ ఇలా చేసేటప్పుడు వైద్యులని కన్సల్ట్ చెయ్యడం మంచిది.


End of Article

You may also like