కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఏడాది ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద హిట్‌లతో విజృంభించిందనే చెప్పాలి. కాకపోతే అందులో కొంత మందికి నిరాశ కలిగితే..మరికొంత మంది మాత్రం హిట్ కొట్టి దిల్ ఖుష్ అయ్యారు. ఈ ఏడాది సినిమాల జోరుతో పాటు.. కాంట్రవర్సీల హోరు కూడా పెరిగింది. 2022 సౌత్ సినిమాకి వివాదాల సంవత్సరం గా కూడా మారిపోయింది. ఇక ఇటీవల కాలంలో సౌత్ సినిమాలో ఏర్పడ్డ వివాదాలేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

#1 అజయ్ దేవగణ్ – సుదీప్ లాంగ్వేజ్ వార్

గత ఏడాది జరిగిన వివాదాల్లో పెద్దది లాంగ్వేజ్ వార్. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కి మధ్య జరిగింది ఈ వివాదం. ఓ ఈవెంట్ లో హిందీ జాతీయ భాష కాదు అని అన్నాడు సుదీప్. దీంతో ఈ వివాదం మొదలైంది. అజయ్ దేవగణ్ సుదీప్ కి ఒక ప్రశ్న ఎదురైంది..’ నీ సినిమాలు ఎందుకు హిందీలో దుబ్ చేస్తున్నావ్ అని..’. దీంతో గొడవ పెరిగి పెద్దదైంది. సౌత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అజయ్ దేవగన్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.

list of contraversies of this year..

#2 సాయి పల్లవి

సాయి పల్లవి చాలా కచ్చితం గా మాట్లాడుతుంది. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెప్తుంది. ఇంతవరకు ఆమె ఏ వివాదాల్లోనూ చిక్కుకోలేదు. కానీ కాశ్మీర్ మారణ హోమాన్ని, ఆవుల స్మగ్లింగ్ లో జరిగిన హత్యలతో పోలుస్తూ మాట్లాడగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

list of contraversies of this year..

#3 నయనతార- విగ్నేష్ సరోగసీ

గత ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్న నయనతార దంపతులు.. అక్టోబర్ లో పిల్లలు పుట్టారంటూ ప్రకటించారు. అయితే వీరు సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారని తెలిసింది. అయితే సరోగసీ ని తమిళనాడు లో నిషేధించారు. దాంతో వీరు నిబంధనలకు విరుద్దంగా సరోగసీ చేశారంటూ.. విమర్షలు గుప్పుమన్నాయి. దాంతో తమిళ ప్రభుత్వం దీనీపై విచారణకు ఆదేశించింది. వీరిద్దరూ 2015లోనే పెళ్లి చేసుకున్నారని, మార్గదర్శకాలను పాటించారని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడైంది. దాంతో ఈ వివాదం సర్దుమణిగింది.

list of contraversies of this year..

#4 కాంతార

గత ఏడాది అందర్నీ ఆకట్టుకున్న చిత్రం కాంతార. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం. అలాగే కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది. సినిమాలో దళితుల ప్రాతినిధ్యాన్ని ప్రశ్నించడం తో పాటు, స్త్రీ విద్వేషపూరిత సన్నివేశాలు ఉన్నాయంటూ ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారు నిర్మాతలు. అలాగే సినిమాకి హైలైట్ అయిన వరాహ రూపం పాట కూడా తమ సాంగ్ కి కాపీ అని కేరళ కు చెందిన ఒక మ్యూజిక్ బ్యాండ్ కేసు వేసింది. కానీ కోర్ట్ ఈ కేసు ని కొట్టేసింది.

list of contraversies of this year..

#5 లైగర్

విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. దీంతో నిర్మాత ఛార్మి సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంది. మరో వైపు పలువురు రాజకీయనాయకులు ఈ చిత్రం లో నల్లధనం పెట్టుబడి పెట్టినట్లుగా ఆరోపణలు రావడంతో మేకర్స్ వివాదాల్లో పడ్డారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది.

list of contraversies of this year..

#6 అజిత్ – విజయ్ సినిమాల వివాదం

సంక్రాంతికి విడుదల అయిన దళపతి విజయ్ వారసుడు, అజిత్ తునివు మధ్య వివాదం నడిచింది. అయితే ఈ రెండు చిత్రాలకు సమానంగా థియేటర్లు కేటాయించారు. కానీ వారసుడు నిర్మాత ‘దిల్ రాజు’ విజయ్ .. అజిత్ కంటే పెద్ద స్టార్ కాబట్టి ఇంకా ఎక్కువ స్క్రీన్ లు ఇవ్వాలని అడుగుతా అని అనడంతో వివాదం మొదలైంది. అయితే దీనిపై దిల్ రాజు వివరణ ఇచ్చారు.

list of contraversies of this year..

#7 రిషబ్ శెట్టి – రష్మిక వివాదం

రష్మిక మందన్న ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇది దేశంలోనే చర్చనీయాంశం అయ్యింది. రష్మిక కాంతారను చూడలేదని మరియు ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టిపై అనుచితంగా మాట్లాడిందంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్ ఫేస్ చేసింది రష్మిక. అంతే కాదు కన్నడాలో లైఫ్ స్టార్ట్ చేసిన రష్మిక, తన మాతృ భాషకు అన్యాయం చేస్తుందంటూ..కన్నడిగులు మండి పడ్డారు. దానిపై వివరణ ఇచ్చేనందుకు ట్రై చేసింది రష్మిక.

list of contraversies of this year..

#8 కన్నడ హీరో దర్శన్

ఇక కన్నడ స్టార్ హీరో దర్శన్ గత ఏడాది రెండు వివాదాల్లో చిక్కుకున్నాడు. మొదట భరత్ అనే నిర్మాతను బెదిరించినందుకు దర్శన్‌పై పోలీసు కేసు నమోదైంది. ఆ తర్వాత తన క్రాంతి సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు అదృష్ట దేవిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది, చాలా మంది అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక ఆతరువాత జరిగిన క్రాంతి ఆడియో ఈవెంట్ లో దర్శన్ కర్ణాటకలోని హోసపేటలో ఉన్నప్పుడు, పునీత్ రాజ్‌కుమార్ అభిమాని అతనిపై చెప్పు విసిరాడు.ఇది ఇప్పటికీ సర్ధుమనగలేదు.

list of contraversies of this year..
#9 మమ్ముట్టి

మలయాళంలో కూడా కొన్ని వివాదాలు నమోదు అయ్యాయి. దర్శకుడిని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అనుచితంగా మాట్లాడటం దుమారం రేపింది. యంగ్ డైరెక్టర్ ను పట్టుకుని.. నెత్తిమీద జుట్టు లేదు కాని.. తెలివైన వాడు అంటూ.. మమ్ముట్టి మాట్లాడటంతో దూమారం రేగింది. దాంతో మమ్ముట్టి.. ఈ విషయంలో వివరణ ఇచ్చారు.

list of contraversies of this year..