చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు ఒక ప్రపంచ ప్రసిద్ధ కళాకారుడు ప్యారిస్ లోని ఒక కాఫీ షాప్ లో కూర్చొని ఉన్నాడు. ఒక ఆవిడ ఆయనను గుర్తు పట్టి ఆయన దగ్గరికి వచ్చి తాను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని తన కోసం ఏదైనా ఒక బొమ్మ వేసి ఇవ్వమని, దాని ఖరీదు ఎంత అయినా పర్లేదు తాను డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని కోరింది. దానికి ఆ చిత్రకారుడు నవ్వాడు. కానీ అతని దగ్గర పెయింటింగ్ వేసేందుకు కాన్వాస్ కానీ పెయింట్ గాని బ్రష్ కానీ లేదు. అయినా సరే ఆమె అడిగింది కాబట్టి అతని జేబులో ఉన్న ఒక పెన్సిల్ తీసి టేబుల్ మీద ఉన్న ఒక నాప్కిన్ మీద బొమ్మ వేశారు. ఆ చిత్రకారుడికి ఆ బొమ్మ వేయడానికి పట్టిన సమయం ఐదు నిమిషాలు.

Video Advertisement

ఆ పెయింటింగ్ చాలా మామూలుగా ఉన్నా తను అడగంగానే వెంటనే వేసి ఇచ్చినందుకు ఆ అభిమాని ఎంతో సంతోషించింది. దాంతో ఆ పెయింటర్ ని పెయింటింగ్ ఖర్చు ఎంత అని అడిగింది. ఆ నాప్కిన్ మీద పెయింటర్ వేసినది ఒక పావురం బొమ్మ. దాంతో దాని ఖరీదు మామూలుగానే ఉంటుంది అనుకుంటాం. ఆ అభిమాని కూడా అలానే అనుకుంది. కానీ ఆ చిత్రకారుడు ఆ బొమ్మకి చెప్పిన ఖరీదు దాదాపు 10000 డాలర్లు. దాంతో ఆ అభిమాని ఆశ్చర్యపోయింది.

“ఏంటి మీరు వేసింది చాలా మామూలు పెయింటింగ్. అది వేయడానికి ఐదు నిమిషాలు పట్టిందేమో. దానికి అంత పెద్ద మొత్తం అడుగుతారా? అసలు వల్ల ఐదు నిమిషాల్లో వేసిన బొమ్మ కి ఎవరైనా అంత డబ్బులు చెల్లిస్తారా?” అని కొంచెం కోపంగానే అడిగింది.

దానికి ఆ చిత్రకారుడు “ఇది గీయడానికి పట్టిన సమయం ఐదు నిమిషాలు కాదు 40 సంవత్సరాలు” అని చెప్పాడు. ఆ అభిమాని “40 సంవత్సరాలు ఏంటి?” అని అడిగింది. దానికి అతను “ఒక చిత్రకారుడు ఇలా అడిగిన వెంటనే పెయింటింగ్ వేయాలి అంటే అది కూడా అంత తొందరగా వేయాలి అంటే చాలా కసరత్తు కావాలి. నేను 40 సంవత్సరాలు కష్టపడితే ఇంత నైపుణ్యం సంపాదించగలిగాను. అందుకే నా కష్టం ధర 40 సంవత్సరాలు” అని సమాధానమిచ్చాడు.

representative image

దీన్నిబట్టి అర్థమైన విషయం ఏంటి అంటే ఎప్పుడు మన కష్టాన్ని తక్కువ అంచనా వేయనీయకూడదు. మనం మన ప్రతిభ తో ఎంత పెద్ద పని చేశాం, ఎంత ఎక్కువ పని చేశాం అన్న దాని మీద కొలవకూడదు. మనకి ఉన్న ప్రతిభతో మనం చిన్న పని చేసినా కూడా అది ఏ తప్పులు లేకుండా పర్ఫెక్ట్ గా చేయాలి. అందులోనే ఒక మనిషి ప్రతిభ కనిపిస్తుంది.

ఇంతకీ ఆ చిత్రకారుడు ఎవరో చెప్పలేదు కదా. ఆయన మరెవరో కాదు పాబ్లో పికాసో. ఆయన వేసిన బొమ్మలు మనకి ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో బయట చాలా గొప్ప వాటిని పికాసో పెయింటింగ్ ల తో పోలుస్తారు కాబట్టి ఆయన వేసినవి అంటే గొప్ప గానే ఉంటాయి అని అనుకుంటాం.

ఇప్పుడు ఇందులో మీరు గమనిస్తే మనం పికాసో ఎన్ని పెయింటింగులు వేశాడు అన్నదానిపై ఆయన ప్రతిభను కొలవట్లేదు. ఆయన ఎంత గొప్ప పెయింటింగులు వేసేవాడు అన్న దానిపై ఆయన ప్రతిభని మనం పరిగణిస్తున్నాం. ఇంగ్లీష్ లో క్వాలిటీ ఈజ్ బెటర్ దాన్ క్వాంటిటీ అని అంటారు. అదే నిజం. ఎప్పుడైనా మనం చేసే పని ఎంత దూరం వెళ్ళింది అని ఆలోచించండి ఎంత లోతుగా చేయగలిగామని ఆలోచించండి. అందులోనే మీ ప్రతిభ కనబడుతుంది.