విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. శ్రీలీల హీరోయిన్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. పోస్టర్‌ చాలా క్రియేటివ్‌గా ఉంది.

Video Advertisement

 

 

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై విజయ్‌ ఫేస్‌ కనిపించడం విశేషం. హీరో కళ్ళలో ఇంటెన్స్ కనిపిస్తోంది. అలాగే ఆ పోస్టర్ పై `నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు, అనామక గూఢచారి` అని రాసి ఉంది.

copy rumours on VD12 poster..!!

ఈ మూవీ లో విజయ్ స్పైగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ కాంబినేషన్ లో మరో చిత్రం అనే సరికి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

copy rumours on VD12 poster..!!

అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ మూవీ పోస్టర్ కాపీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘ఆర్గో’ అనే హాలీవుడ్ సినిమా పోస్టర్ ను పోలి ఈ పోస్టర్ ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ సినిమాకి ఈ సినిమా కాపీ అనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి.

copy rumours on VD12 poster..!!

దీంతో నిర్మాత నాగ వంశీ రంగంలోకి ఇది.. ‘మాది కాపీ సినిమా కాదు. పోస్టర్ అనేది వేరు. ఇది కో ఇన్సిడెన్స్ అని కూడా అనుకోవచ్చు’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయితే గాని ఈ ఊహాగానాలకు తెరపడదు.

copy rumours on VD12 poster..!!

ఇక మరో వైపు విజయ్‌ దేవరకొండ నటించబోతున్న మరో సినిమా అప్‌ డేట్‌ కూడా వచ్చింది. తనకు గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి స్టార్‌ హీరోని చేసిన దర్శకుడు పరశురామ్‌తో విజయ్‌ మరో సినిమా చేస్తున్నారు. `వీడీ13` పేరుతో రూపొందే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. విజయ్‌కి బర్త్ డే విషెస్‌ చెబుతూ టీమ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించబోతున్నామని పేర్కొంది.