రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు తనకు కలిసొచ్చిన అదే జోనర్ లో సంక్రాంతి బరిలో నిలిచారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోషించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా శృతి హాసన్ నటించింది. అలానే విలన్‌గా కన్నడ నటుడు దునియా విజయ్ నటించాడు.

Video Advertisement

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్స్‌, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇన్ సైడ్ రిపోర్ట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. వీరసింహారెడ్డి ఇన్ సైడ్ రిపోర్ట్ కూడా చాలా బాగుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ చిత్రం అని అంటున్నారు.

Also Read:  TODAY RASHI PHALALU 10.01.2023: ఈరోజు ఈ రాశి వారు ఊహించని ఫలితాలు పొందుతారు.. ఇందులో మీరున్నారా..?

the price of balakrishna watch in veerasimhareddy movie..!!

అయితే ఈ సినిమాలో బాలయ్య పెట్టుకున్న ఒక వాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాలయ్య పెట్టుకున్న రోలెక్స్ కంపెనీ కి చెందినది. ఆ వాచ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డ్యాతోనా మోడల్ కి చెందినది. దాని విలువ పధ్నాలుగు లక్షల యాభయ్ ఆరువేలు. అయితే దీని విలువ తెలుసుకున్న బాలయ్య ఫాన్స్ షాక్ అవుతున్నారు. అలాగే బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ధరించిన కార్టియర్ వాచ్ విలువ కూడా 24 లక్షలకు పైమాటే.

 

the price of balakrishna watch in veerasimhareddy movie..!!
ఇటీవల ఇటు బాలకృష్ణ అఖండ సినిమాతో, అటు గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ టీజర్స్, ప్రోమోలు చూస్తే ఈ సినిమా హై యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, వీరసింహారెడ్డి సినిమా లేక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇన్ సైడ్ రిపోర్టుల ద్వారా సమాచారం అందుతోంది.