Ads
సెలబ్రిటీల పెళ్లి అంటే అదో పెద్ద వేడుక. అందరి దృష్టి వారిపైనే పడుతుంది. దుస్తులు తయారు చేయడానికి డిజైనర్లు, సినిమాలను తలపించే పెద్ద పెద్ద సెట్టింగ్‌లు, సంగీత్‌లు, మెహందీ ఫంక్షన్లు.. అయితే సెలబ్రిటీల లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అభిమానులకి, సాధారణ ప్రేక్షకులకి ఆతృతగా ఉంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆరాటపడతారు. ఇక వాళ్ళ పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు లాంటివి అయితే ఆ ఫోటోలు, వీడియోలు చూడాలనుకుంటారు.
Video Advertisement
అందుకే చాల మంది సెలెబ్రెటీలు వాళ్ళ పెళ్లి, నిశ్చితార్థం, పర్సనల్ లైఫ్ ని కూడా వీడియోల రూపంలో యూట్యూబ్‌లో పెడుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇక స్టార్ సెలబ్రిటీలు అయితే తమ పెళ్లి వీడియోల్ని అధికారికంగా పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలకి అమ్ముతున్నారు. ఇటీవల నయనతార విగ్నేష్ శివన్ తో జరిగిన తన వివాహాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి అమ్మారు. ఇప్పుడు యాపిల్ బ్యూటీ హన్సిక కూడా అదే చేస్తోంది.
హన్సిక ఇటీవలే సోహైల్ కతూరియాని వివాహం చేసుకుంది. వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వీరి పెళ్లి వీడియో మాత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతోంది. హన్సిక, సోహైల్ పెళ్లి వీడియో డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఈ పెళ్ళికి సంబంధించి హన్సిక లవ్ షాదీ డ్రామా అనే టైటిల్ తో ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో కోసం హన్సిక 16 కోట్ల రూపాయలు తీసుకుందని సమాచారం.
ఈ నేపథ్యంలో ఈ వేడుకకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. టీజర్‌తో అందరినీ దృష్టిని ఆకర్షించిన హన్సిక తాజాగా ట్రైలర్లోనూ ఎమోషనల్ అయ్యింది. ఇందులో హన్సిక తన ప్రేమకు అసలు ఎక్కడ బీజం పడింది.. కుటుంబ సభ్యుల సపోర్ట్ వంటి అంశాలను పంచుకుంది. అలాగే తన వివాహ విషయం లో హన్సిక ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది.. తన పై వచ్చిన విమర్శలు.. పుకార్లు వంటి వాటికి హన్సిక ఇందులో సమాధానాలు ఇచ్చింది.
End of Article