అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేందుకు చైతూ రెడీ అవుతున్నాడు.
Video Advertisement
ఈ మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అరవింద్ స్వామి ప్రతి నాయక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది. వెంకట్ ప్రభు ఇటీవలే ‘మానాడు’తో మంచి ఫాంలోకి వచ్చారు. మరోవైపు నాగ చైతన్యకు మాత్రం ‘థాంక్యూ’ రూపంలో గతేడాది గట్టి షాక్ తగిలింది. దీంతో తన కెరీర్‌లో ‘కస్టడీ’ ఎంతో కీలకంగా మారింది. ఈ చిత్రానికి సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
అయితే తాజాగా నాగ చైతన్య లుక్ ఒకటి వైరల్ గా మారింది. చై ఫుల్ కాజువల్ లుక్ లో ఉన్న ఆ ఫొటోలో నాగ చైతన్య ధరించిన వాచ్ గురించి నెట్టింట చర్చలు నడుస్తున్నాయి. నాగ చైతన్య ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లె బ్రాండ్‌కు చెందిన RM -030 . దీని ఖరీదు 1,15 ,73 ,580 కోట్లు. దీంతో దీని విలువ చూసిన చై ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఒక్క వాచ్ ఇంత రేట్ ఆహ్.. అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక తన రానున్న చిత్రం కస్టడీ లో ఆయన సీరియస్ అండ్ రివల్యూషనరీ రోల్ చేస్తున్నట్లు సమాచారం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. టీజర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. కృతి శెట్టి కూడా గత చిత్రాలకు భిన్నమైన పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. నాగ చైతన్య తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు.