మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. తానేంటో నిరూపించుకొని గ్లోబల్ స్టార్ గా మారారు. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే జరిగింది. ఈ బర్త్ డే కి మెగా సంఫంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ ఏడాది చ‌ర‌ణ్ సెల‌బ్రేట్ చేసుకున్న ఈ బ‌ర్త్ డేకి వారికెంతో స్పెష‌ల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆయ‌న హీరోగా న‌టించిన RRR మూవీలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డ్ రావడం తో పాటు.. త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే.

Video Advertisement

ఈ నేపథ్యం లో తన ఇంట్లో మెగా పార్టీ ని ఇచ్చారు చిరంజీవి. ఈ వేడుకలో ఉపాసన బేబీ బంప్ తో కనిపించి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ఈ పార్టీ కి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పార్టీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ బర్త్ డే సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు ఒక్క చోటుకు చేరడం తో టాలీవుడ్‌ లో మంచి వాతావరణం ఉందని ప్రేక్షకులు సంబరపడుతున్నారు.

know the price of ram charan birthday dress ..

అయితే ఈ బర్త్ డే వేడుకలకు రామ్ చరణ్ బ్లాక్ డ్రెస్ లో మెరిశారు. దీంతో రామ్ చరణ్ ధరించిన సిల్క్ క్రేప్ బ్లాక్ ప్రింటెడ్ డ్రెస్ ధర ఎంత ఉంటుందా అని ఫాన్స్ నెట్టింట సెర్చ్ మొదలు పెట్టేసారు. రామ్ చరణ్ ధరించిన బ్లాక్ షర్ట్ సెయింట్ లారెన్ కంపెనీ కి చెందినది. ఈ సిల్క్ క్రేప్ షర్ట్ ధర 89 ,584 రూపాయలు. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. చూడటానికి ఎంతో సింపుల్ గా ఉన్న ఆ షర్ట్ అంత విలువా..?? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

know the price of ram charan birthday dress ..

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. చరణ్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజెర్ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాగా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.