టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అభిమానుల అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. ఇక సమంత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేసింది.

Video Advertisement

రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రియాంక చోప్రా నటించిన ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రీమియర్ కి కూడా సామ్ హాజరయ్యింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి.

samantha statement jewellary cost..!!

ఈ షోకు ఇండియన్ వెర్షన్ నటీటనలు, దర్శకులు సమంత, వరుణ్ ధావన్, రాజ్, డీకే హాజరయ్యారు. ప్రియాంక చోప్రాతో కలిసి సమంతా ఈ షో తిలకించారు. లండన్ లో జరిగిన ఈ ప్రీమియర్ లో సామ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు. సమంత స్టేట్‌మెంట్ నెక్‌పీస్, బ్రాస్‌ లెట్‌ తో కూడిన బ్లాక్ కో-ఆర్డ్ సెట్‌ తో మెరిసిపోయింది.

samantha statement jewellary cost..!!

డైమండ్ నగలు ధరించిన సమంత.. ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా సామ్ లుక్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సిటాడెల్ ప్రీమియర్ షో కోసం విక్టోరియా బెక్ హమ్ బ్రాండ్ డ్రస్ ధరించారు సమంత. అయితే సమంత ధరించిన నగల గురించి, వాటి విలువ తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

samantha statement jewellary cost..!!

ఈ ఈవెంట్ లో సమంత డైమండ్స్ తో చేసిన బల్గరి స్నేక్‌ నెక్లెస్‌, బ్రేస్‌లెట్‌ ధరించారు. సామ్ ధరించిన నెక్ పీస్ ధర రెండు కోట్ల తొంబై ఏడు వేల రూపాయలు (2 ,97 13 ,975 ) . అలాగే బ్రాస్లెట్ ధర రెండు కోట్ల అరవైఏడు వేల రూపాయలు (2 ,67 , 24 , 750 ) గా ఉంది. సింపుల్ గా ఉన్న ఈ నగల ధర 4 కోట్ల రూపాయలా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

samantha statement jewellary cost..!!

ఇక ‘సిటాడెల్’ సిరీస్ బాలీవుడ్ లోనూ తెరకెక్కుతోంది. దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమంతను ’సిటాడెల్’ ఇండియన్ వర్షన్ మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. సమంత చేసే ఈ సిరీస్ పై కూడా ఇండియాలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కూడా షూటింగ్ జరపుకుంటోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.