విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూత్ లో అతడికి ఉన్న క్రేజే వేరు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ప్లాప్ అయినా విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి అతి తక్కువ సమయం లోనే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.

Video Advertisement

 

ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణం దర్శకత్వం లో సమంత తో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ఈ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నాడు. కానీ సమంత అనారోగ్యం కారణం గా ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. అయితే తన సినిమాలతో పాటు, తన డ్రెస్సింగ్ తో కూడా పాపులర్ అయ్యాడు విజయ్ దేవరకొండ. నిజానికి విజయ్ ఒక ఫాషన్ ఐకాన్. ఎలాంటి దుస్తులు ధరించినా మంచిగా కనిపిస్తాడు విజయ్. అలాగే రౌడీ ఫాషన్ వేర్ ద్వారా ఫాషన్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు విజయ్.

know the cost of vijay devarakonda watch..

తన రౌడీ బ్రాండ్ దుస్తులు ధరించి పలు ఈవెంట్స్ కి హాజరవడం, ఫోటో షూట్స్ చేస్తూ ఉంటాడు విజయ్. అతను ధరించే డ్రెస్సులు అన్నీ స్టైలిష్ గా ఉంటాయి. ఆ డ్రెస్సుల్లో ఇతను చేసే ఫోటో షూట్లు కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా విజయ్ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అందులో అతడు ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. దీంతో ఆ వాచ్ గురించి శోధించటం ప్రారంభించారు విజయ్ ఫాన్స్.

know the cost of vijay devarakonda watch..

నెట్లో ఆ వాచ్ గురించి శోధించగా.. విజయ్ ధరించిన ఆ వాచ్ ఓ కార్టియర్ వాచ్. ఈ వాచ్ సాంటోష్ డి కార్టియర్ వాచ్. దాని విలువ ఏకంగా రూ.30,42,935.07 లక్షలట. ఈ వాచ్ ధర తెలిసిన తర్వాత నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వాచ్ గురించి చర్చలు జరుగుతున్నాయి.