పెళ్లి ఎవరి జీవితం లో అయినా ఒక మధురమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవరికీ వారు వారి స్థాయిని బట్టి అంగరంగ వైభవం గా పెళ్లి ని వేడుకగా చేసుకుంటారు. ఐతే..సామాన్యులతో పోలిస్తే సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ కాస్ట్లీగానే ఉంటుంది. అయితే.. వీరు చేసుకునే పెళ్లి వేడుకలు కూడా చాలా కాస్ట్లీ గానే ఉంటాయి. ఇప్పుడు మనం అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు చేసుకున్న ఆరుగురు టాలీవుడ్ హీరోలు ఎవరో చూద్దాం..

#1 జూనియర్ ఎన్టీఆర్ & లక్ష్మి ప్రణతి:

1 ntr
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి ల వివాహం మే 5 , 2011 న జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ప్రముఖ బిజినెస్ మాన్ శ్రీనివాస రావు కూతురు లక్ష్మి ప్రణతి ని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. లక్ష్మి ప్రణతి కూడా పేరు ప్రఖ్యాతలు కలిగిన స్టూడియో ఎన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరి వివాహానికి మొత్తం వంద కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఒక్క కల్యాణ మండపం కోసమే 18 కోట్ల రూపాయలను ఖర్చు చేసారు.

#2 రాజీవ్ రెడ్డి & బ్రహ్మణి

2 rajeev
మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి జనార్ధన రెడ్డి తనకూతురు బ్రహ్మణి వివాహ వేడుకను ఘనం గా చేశారు. బ్రహ్మణి ని విక్రమ్ దేవా రెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి కి ఇచ్చి వివాహం చేసారు. 16 నవంబర్ 2016 న వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం జనార్దన రెడ్డి ఐదువందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారట.

#3 అల్లు అర్జున్ & స్నేహ రెడ్డి:

3 allu
స్నేహ, అల్లు అర్జున్ లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. మార్చి 6 , 2011 న వీరు వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి కూడా దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందని అంచనా. ఎంగేజ్మెంట్ కోసం స్నేహ కట్టుకున్న శారీ ఖరీదు లక్ష రూపాయలు ఉంటుందట.

#4 రామ్ చరణ్ & ఉపాసన:

4 ramcharan
వీరిద్దరూ చాలా కాలం పాటు ప్రేమించుకున్న తరువాత 14 జూన్, 2012 లో వివాహబంధం తో ఒక్కటయ్యారు. అమితాబ్ బచ్చన్, బోని కపూర్, రజినీకాంత్ లు కూడా వీరి వివాహానికి హాజరు అయ్యారు. వీరి వెడ్డింగ్ కార్డు లు కూడా ఖరీదైనవే. ఒక్కో కార్డు కోసం 1200 ల రూపాయలు ఖర్చు చేసారు.

#5 ధనుష్ & ఐశ్వర్య:

5 dhanush
తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్యను 18 , నవంబర్ 2004 లో వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య లా చదువుకున్నారు. ఆమె డైరెక్టర్ అన్న విషయం మనందరికీ తెలుసు. ధనుష్ తండ్రి కూడా ఒకప్పుడు నిర్మాత గా, దర్శకుడిగా వ్యవహరించారు. అమితాబ్ బచ్చన్, హేమ మాలిని తో పాటు పలువురు సెలెబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు.

#6 జ్యోతిక & సూర్య:

6 surya
సూర్య , జ్యోతిక కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరు సెప్టెంబర్ 11 , 2006 న వివాహం చేసుకున్నారు. పెళ్లి కోసం జ్యోతిక ధరించిన చీర ఖరీదు ఒక్కటే మూడు లక్షల రూపాయలట. వీరి వివాహానికి అయిన ఖర్చు కూడా కోట్లలో ఉంది. కమలహాసన్, ధనుష్ &ఐశ్వర్య, విజయ్ తో పాటు పలువురు సెలెబ్రిటీలు వీరి వివాహానికి హాజరు అయ్యారు.