మనందరికీ ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి ఉన్నా కూడా దేనికోసం ప్రాకులాడుతూ ఉంటాం.. కానీ నాణేనికి రెండో వైపు ఉన్నట్లే, కొందరు వ్యక్తులు ఉన్నదాన్లోనే సంతృప్తి గా గడిపేస్తుంటారు. తమకు నచ్చినా విధం గా తమకు ఉన్న దాన్లోనే సర్దుకుపోతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తులే గార్సియా మరియు ఆమె భర్త మిగ్యుల్ రెస్ట్రెపో. వీరిద్దరూ గత 22 సంవత్సరాలు గా మురికి కాలువ లోపల నివసిస్తున్నారు. నమ్మబుద్ది కావడం లేదా? నిజం.. వీరి కధ వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి.

couple lives in sewer 1

మరియా మరియు మిగ్యుల్ ఇద్దరు కొలంబియాలోని మెడెల్లిన్‌లో కలుసుకున్నారు. అప్పటికి వీరిద్దరూ డ్రగ్స్ అడిక్ట్స్. వారు నివసించే ప్రాంతం కూడా హింస మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు బాగా ప్రసిద్ధి చెందింది. వారు అలాంటి వీధుల్లో నివసించడం వలన, వారు మాదక ద్రవ్యాలకు బానిసలు గా మారిపోయారు. ఈ బాధ లో ఉన్నప్పుడే ఇద్దరు ఒకరి సాన్నిధ్యం లో మరొకరు ఓదార్చుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల వ్యసనాన్ని వదిలించుకోవాలని ఇద్దరు అనుకున్నారు. కానీ, వారికి సాయం చేయడానికి ఎవరు ముందుకురాలేదు.

couple lives in sewer 2

స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరు వారికి ఆశ్రయం ఇవ్వలేదు. దీనితో, డ్రైనేజీ లోనే వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే వారు తమ జీవితాలను కొత్తగా మలుచుకున్నారు. ఈ క్రమం లోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటినుంచి వారు అక్కడే నివాసం ఉంటున్నారు. అక్కడనుంచి వదిలి వెళ్లి కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి కూడా వారు ఇష్టపడటం లేదు. మాములుగా అయితే, డ్రైనేజి లోపల ఎంతో అపరిశుభ్రం గా ఉంటుంది.. కానీ వీరిద్దరూ తమకు అవసరమైన వస్తువులతో ఆ ఇంటిని నివాసయోగ్యం గా మార్చుకున్నారు. ఆ ఇంట్లో వారికి కరెంట్ ఉంది. లైట్లు వేసుకుంటారు. చిన్న టీవీ, కిచెన్ తో సహా అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకుని హ్యాపీ గా ఉంటున్నారు.

couple lives in sewer

అందరిలాగే, వారు పండగలను కూడా కలిసి జరుపుకుంటారు. వారిద్దరూ కలిసి బ్లాకీ అనే ఓ కుక్కను కూడా పెంచుకుంటున్నారు. ఈ కుక్క వారు లేని సమయం లో ఇంటికి కాపలా కాస్తుంది. వారి చింతలేని కుటుంబం లో ఈ కుక్క కూడా ఓ భాగమైపోయింది. జీవితం లో సంతోషం గా బతకడానికి మనకు కావాల్సింది ప్రేమ ఒక్కటే అని వీరి కధ మనకు పాఠం నేర్పుతుంది.