గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్స్…ఎవరెవరు ఏ హోదాలో అంటే.?

గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్స్…ఎవరెవరు ఏ హోదాలో అంటే.?

by Mohana Priya

Ads

క్రికెట్ ఆడే ప్లేయర్స్ అందరికీ క్రికెట్ కాకుండా ఇంకొక ప్రొఫెషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 సచిన్ టెండూల్కర్

అసలు పరిచయం అవసరం లేని వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఇరవై సంవత్సరాలకి పైగా భారత క్రికెట్ జట్టు తరపున ఆడారు సచిన్. తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ నెలకొల్పారు. ఎన్నో బిరుదులు కూడా అందుకున్నారు. ఎంతో మంది ప్లేయర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. 2010 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ గా నియమితులయ్యారు సచిన్ టెండూల్కర్.

#2 మహేంద్ర సింగ్ ధోని

ఇంటర్నేషనల్ స్థాయి లో బెస్ట్ కెప్టెన్స్ లో ఒకరిగా పేరు సంపాదించారు మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో అడుగు పెట్టకముందు ధోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేశారు. 2011 లో 28 సంవత్సరాల తర్వాత ధోని కెప్టెన్సీ లో భారత క్రికెట్ జట్టు 50 ఓవర్ వరల్డ్ కప్ సాధించింది. అదే సంవత్సరంలో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ ద్వారా లెఫ్టినెంట్ కల్నెల్ గా నియమించబడ్డారు మహేంద్ర సింగ్ ధోని.

#3 యుజ్వేంద్ర చాహల్

లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ లో లీడింగ్ స్పిన్నర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు యుజ్వేంద్ర చాహల్. 2016 లో భారత జట్టు తరపున ఆడడానికి ఎంపికయ్యారు చాహల్. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యుజ్వేంద్ర చాహల్ కి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పోస్ట్ ని ఆఫర్ చేశారు .

#4 కే. ఎల్. రాహుల్

భారత దేశంలో బెస్ట్ బ్యాట్స్ మెన్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు కే ఎల్ రాహుల్. గత రెండు సంవత్సరాలలో తన పెర్ఫార్మెన్స్ తో టాప్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా కే ఎల్ రాహుల్ ని అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఫైనాన్షియల్ లిటరసీ ఇంకా భారత దేశంలో ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆర్బీఐ వాళ్ళు రూపొందించిన అడ్వర్టైజ్మెంట్ లో కూడా కే ఎల్ రాహుల్ కనిపించారు.

#5 జోగిందర్ శర్మ

2007 లో జరిగిన T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో బౌలింగ్ చేసిన మాజీ ఇండియన్ పేసర్ జోగిందర్ శర్మ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ లో అపాయింట్ చేయబడ్డారు. జోగిందర్ శర్మ ప్రస్తుతం డిప్యూటీ సూపెరిండెంట్ అఫ్ పోలీస్ గా చేస్తున్నారు. ఇటీవల కోవిడ్ సమయంలో ప్రజలని ఇంట్లో ఉండమని జోగిందర్ శర్మ చెప్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read >>> అందంలో సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని టాప్ 10 ఉమెన్ క్రికెటర్స్.! animated-arrow-image-0044


End of Article

You may also like