‘నాగ చైతన్య’ “కస్టడీ” మూవీ హిట్ అవ్వాలంటే ఎంత రావాలో తెలుసా..??

‘నాగ చైతన్య’ “కస్టడీ” మూవీ హిట్ అవ్వాలంటే ఎంత రావాలో తెలుసా..??

by Anudeep

Ads

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్‌ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు అనుకునే లోపు థాంక్యూ ద్వారా మరో ఫ్లాప్‌ మూటగట్టుకున్నాడు.

Video Advertisement

 

 

ఈ నేపథ్యంలో చైతూ ఇపుడు ఔట్ అండ్ ఔట్ మాస్ పోలీస్ పాత్రలో నటించిన మూవీ ‘కస్టడీ’. ఈ మూవీలో చైతూ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించారు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన ఈ మూవీ బై లింగ్వల్‌గా రబీఫాతోంధి. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ 22వ మూవీగా వస్తోంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

custody movie break even target..!!

ఈ మూవీ మే 12 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రానికి ఒక కట్ చెప్పకుండా సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య, అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో కీలకం అంటున్నారు. అదే ఈ సినిమాకు ఆయువు పట్టు అని సెన్సార్ సభ్యులు వ్యాఖ్యానించినట్టు సమాచారం.

custody movie break even target..!!

అలాగే క‌స్ట‌డీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 22 కోట్ల వ‌ర‌కు చేసిన‌ట్లు స‌మాచారం. ఆంధ్రా థియేట్రిక‌ల్ రైట్స్ ఎనిమిదిన్న‌ర కోట్ల‌కు అమ్ముడు పోయిన‌ట్లు తెలుస్తోంది. నైజాంలో ఏడు కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు చెబుతోన్నారు. థియేట్రిక‌ల్ హ‌క్కుల ద్వారా ఏపీ తెలంగాణ‌లో క‌లిపి ప్రొడ్యూస‌ర్స్‌కు 18 కోట్లు వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఓవ‌రాల్‌గా 22 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

custody movie break even target..!!

థియేట్రిక‌ల్ రిలీజ్ ద్వారా 23 కోట్లు క‌లెక్ట్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ‘కస్డడీ’ హిట్ అనేది నాగ చైతన్యకు అత్యంత కీలకం అని చెప్పాలి. ఈ సినిమా సక్సెస్‌తో అక్కినేని ఫ్యామిలీ హీరోల ఫ్లాపుల పరంపరకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా అక్కినేని హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు. చైతూ ‘థాంక్యూ’ నుంచి మొదలు పెడితే.. ఆ తర్వాత నాగార్జున ‘ఘోస్ట్’తో పాటు.. రీసెంట్‌గా అఖిల్ హీరోగా వచ్చిన ‘ఏజెంట్’ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.

custody movie break even target..!!

ఈ నేపథ్యంలో ‘కస్టడీ’ హిట్ అనేది అటు నాగ చైతన్యతో పాటు అక్కినేని హీరోలకు కీలకం గా మారనుంది. ఈ సినిమాలో అర‌వింద్ స్వామి, ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. ఈ సినిమాతో హీరోగా నాగ‌చైత‌న్య త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుండ‌గా…డైరెక్ట‌ర్ వెంక‌ట్‌ప్ర‌భు టాలీవుడ్‌లో అడుగుపెడుతోన్నారు.

 

Also read: “నాగచైతన్య” నటించిన “కస్టడీ” మూవీ సెన్సార్ టాక్..!! మూవీ ఎలా ఉందంటే..??


End of Article

You may also like