కొన్ని “ప్లగ్స్” కి ఇలా “కట్” ఎందుకు ఉంటుందో తెలుసా.? వెనకున్న కారణాలు ఇవే.!

కొన్ని “ప్లగ్స్” కి ఇలా “కట్” ఎందుకు ఉంటుందో తెలుసా.? వెనకున్న కారణాలు ఇవే.!

by Megha Varna

Ads

మన పరిసరాలలో ఉండే వస్తువులు అన్నీ చాలా నార్మల్ గా కనబడతాయి. కానీ ప్రతి దానికి ఒక రీజన్ తప్పకుండా ఉంటుంది. అటువంటి లాజిక్ ను తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలానే ఎలక్ట్రిక్ ఫ్లగ్ గురించి కూడా ఒక లాజిక్ ఉంది. నార్మల్ గా అందరూ కూడా ప్లగ్స్ ని వాడుతూ వుంటారు.

Video Advertisement

వివిధ పనులకి అవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే మనం వాడుతూ ఉంటాం కానీ ఎప్పుడు ఎందుకు ప్లగ్ కు ఉండే పిన్ పై ఒక కట్ ఉంటుంది అనేది గమనించము. ఒకవేళ గమనించినా అదేమిటో మనకి తెలియదు. అయితే మరి ఎలక్ట్రిక్ ప్లగ్ కు ఉండే పిన్ పై ఒక కట్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి కట్ ఉన్న ఎలక్ట్రిక్ పిన్ కేవలం బ్రాస్ తో తయారు చేసింది. మరియు అల్యూమినియం తో తయారు చేసిన ఎలక్ట్రిక్ పిన్స్ కు ఎటువంటి కట్ ఉండదు. కొన్ని సార్లు బ్రాస్ తో తయారు చేసిన ఎలక్ట్రిక్ పిన్నులు నిఖిల్ తో కోట్ చేస్తారు. ఈ కోటింగ్ వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది. దాంతో ఈ పిన్ స్టీల్ లా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ పిన్ కు కట్ ఉండడం వల్ల హీట్ డిసిపేషన్ జరుగుతుంది, కరెంట్ ఫ్లో అయినప్పుడు బ్రాస్ వేడెక్కుతుంది. దాని వల్ల ఎజక్షన్ జరిగి కరెంటు ఫ్లో అవడానికి కష్టమవుతుంది. అయితే పిన్ పై ఉండే కట్ వల్ల హీట్ డిసిపేషన్ త్వరగా జరుగుతుంది మరియు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కరెంట్ ఫ్లో బాగా జరుగుతుంది.

మరొక కారణం ఏమిటంటే ఎక్కువ వేడి వల్ల పిన్ ఎక్స్పాండ్ అయితే ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది. ఒకవేళ కట్ ఉంటే సాకెట్ లో పెట్టడానికి సులువుగా ఉంటుంది. అయితే కొన్ని లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసే ప్లగ్స్ లో ఎటువంటి కట్ ఉండదు. కాబట్టి వాటిని ఉపయోగించకపోవడం మేలు.


End of Article

You may also like