Ads
Jr .NTR ఇంటి పనులు చేస్తున్న వీడియో… వైరల్ ! రాంచరణ్ వంట వండిన వీడియో… వైరల్ !! ….వాళ్లంటే స్టార్స్ ఏది చేసిన వైరలే.! అంటారా? అయితే ఈ ఏడాది బాబు కూడా లాక్ డౌన్ టైం లో తన వంటలతో ఇంటర్నెట్ స్టార్ అయ్యాడు… క్యూటెస్ట్ కుక్ అంటూ సోషల్ మీడియా చేత చప్పట్లు కొట్టించుకుంటున్నాడు.వివరాల్లోకెళితే… యాష్లే వియన్నా దంపతుల ఏడాది బాబు …కోబే.! అమ్మ వంట చేస్తున్న క్రమంలో తనను ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశంతో కొంత పిండిని ఆ బాబుకిచ్చింది. అమ్మను అనుకరిస్తూ …ఆ బాబు పిండిని అమ్మ చేసినట్టు చేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన యాష్లే…అతనితోనే వంటలను చేయించడం ప్రారంభించింది….
Video Advertisement
ఆ బాబు కూడా ఎంజాయ్ చేస్తూ మరీ వండేస్తున్నాడు . కేక్స్ , పిజ్జాలు, స్నాక్స్ ..ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలను చేసేస్తున్నాడీ బుడతడు.!వంద చేయడమే కాదు…ఎలా చెయ్యాలి అనే దానిపై …వచ్చిన రాని మాటలతో వివరణ కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ వాళ్ల అమ్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో…..లక్షలలో లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా మనోడు సోషల్ మీడియా క్యూటెస్ట్ కుక్ గా వైరల్ అయ్యాడు.
End of Article