Ads
అన్ని వస్తువులు ఒక చోట అందుబాటులో ఉంటూ, అది కూడా రీజనబుల్ ధరలకే లభిస్తున్న చోటు డీ మార్ట్. కేవలం ఒక్క ప్రదేశానికి మాత్రమే పరిమితం కాకుండా భారతదేశం మొత్తం అవైలబుల్ ఉండేలా డీ మార్ట్ స్టోర్స్ చాలా చోట్ల స్థాపించారు. వీకెండ్స్ లో అందులోనూ ముఖ్యంగా సండే అయితే డీ మార్ట్ మొత్తం ఎలా ఉంటుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకు కారణం ఇందాక పైన చెప్పినట్టుగా అన్ని వస్తువులు అందుబాటులో ఉండడమే.
Video Advertisement
ఇలా డీ మార్ట్ ద్వారా భారత దేశంలో అందరికీ అన్నిటిని ఒకటే చోట దొరికేలా అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి రాధా కిషన్ దమాని. డీ మార్ట్ ఫౌండర్ అయిన రాధాకిషన్ దమాని బికానెర్ లో జన్మించారు.రాధా కిషన్ ముంబైలో ఒక సింగిల్ రూం అపార్ట్మెంట్ లో పెరిగారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై లో కామర్స్ లో చేరి ఒక సంవత్సరం తర్వాత డ్రాప్ అయ్యి ట్రేడింగ్ బిజినెస్ రంగం లోకి అడుగుపెట్టారు. రాధా కిషన్ తండ్రి దలాల్ స్ట్రీట్ లో ఉద్యోగం చేసేవారు.
ఆయన (రాధా కిషన్ తండ్రి) చనిపోయిన తర్వాత, రాధా కిషన్ తన బాల్ బేరింగ్ బిజినెస్ వదిలేసి, స్టాక్ మార్కెట్ బ్రోకర్ ఇంకా ఇన్వెస్టర్ అయ్యారు. అలా కొన్ని సంవత్సరాలు అదే రంగంలో రాణించిన రాధా కిషన్ 1999లో నెరుల్ లో ఉన్న అప్నా బజార్ బ్రాంచ్ ఆపరేట్ చేసేవారు. కానీ ఆ బిజినెస్ మోడల్ కి రాధా కిషన్ కన్విన్స్ అవ్వలేకపోయారు. 2000 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ వదిలేసి డీ మార్ట్ స్థాపించడానికి సిద్ధమయ్యారు రాధాకిషన్.
2002 లో సెంట్రల్ ముంబై లో ఉన్న పోవై లో డీ మార్ట్ మొదటి స్టోర్ ను ప్రారంభించారు. 2010 మరపు దాదాపు 25 స్టోర్స్ గా విస్తరించింది డీ మార్ట్. 2017 లో ప్రజలకు ఇంకా చేరువైంది. రాధా కిషన్ పెద్దగా బయట కనిపించరు. అలాగే ఎక్కువగా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వరు. ఇండియన్ బిలియనీర్ అయిన రాకేష్ ఝున్ఝున్వాలా కి, రాధా కిషన్ దమాని స్టాక్ ట్రేడింగ్ టెక్నిక్స్ నేర్పించారు.
End of Article