పూజలో కుళ్ళిన కొబ్బరికాయ వస్తే ఏం చేయాలి….!

పూజలో కుళ్ళిన కొబ్బరికాయ వస్తే ఏం చేయాలి….!

by Mounika Singaluri

Ads

 

హిందువుల పూజల్లో కొబ్బరికాయకి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పనవసరం లేదు. ప్రతి పూజ ఆరంభం ముందు కొబ్బరికాయ కొట్టి ఆరంభించడం మనకి అలవాటు. కొందరైతే కొబ్బరికాయని నైవేద్యంగా కూడా ప్రసాదిస్తారు. కొబ్బరికాయకు లేని విశిష్టత లేదు.

Video Advertisement

కానీ ఒక్కసారి మనకు తెలియకుండా పూజ చేసే సమయంలో కుళ్ళిన కొబ్బరికాయ వస్తాది. అలాంటప్పుడు అరిష్టం ఏదైనా వస్తుందా అని భక్తులకు లేనిపోని సంకోచం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక లోలోపల అంతర్మాధనం చెందుతూ ఉంటారు.

మనం ఏదైనా విశిష్టమైన పని ప్రారంభించే ముందు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిన కాయ వస్తే అది కీడుకు సంకేతం. ఆ పనికి ఏదో ఆటంకం గోచరిస్తుందని శాస్త్రం చెబుతుంది. దీనిపైన భక్తులకు ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం మార్గం ఉందా అంటూ వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ కథనం.

how does water get inside the coconut..!!

ముందుగా కొబ్బరికాయ కొట్టేముందు తేలికగా అనిపిస్తే అది కుళ్ళిన కాయ అని అర్థం
దాన్ని ముందుగానే పక్కన పెట్టి వేయాలి. మనకు తెలియకుండా కాయ కొట్టిన తర్వాత కుళ్ళిందని అర్థమైతే దాన్ని వెంటనే పక్కన పడేసి చేతులు కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక మంత్రం జపించి పరిహారం చేసుకోవాలి. ఈ మంత్రం జపించడం ద్వారా కుళ్ళిన కాయ కొట్టడం ద్వారా వచ్చే దోషం తొలగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.


ఆ మంత్రం ఏంటంటే…”వనమాలి గదే శాంకి… శంకేచక్రిచనందకి శ్రీమన్నారాయనోవిష్ణు వాసుదేవో విరక్షకు”ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించాలి.ఈ మంత్రం జపించడం వల్ల కుళ్ళిన కొబ్బరికాయ కొట్టడం ద్వారా వచ్చే శకునం తొలగుతుందని తెలిపారు.

Also Read:23, 24 తేదీల్లో దసరా పండగ ఎప్పుడు జరుపుకోవాలి…? పండితులు ఏం చెప్తున్నారు అంటే..?


End of Article

You may also like