భారతీయుల్లో ఎక్కువ శాతం మంది బ్రౌన్ కలర్ మేని ఛాయను కలిగి ఉంటారు. రంగు అనేది ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను బట్టి చాలా ఏళ్ల క్రితమే ఏర్పడిందని మనందరికీ తెలుసు. కానీ, భారతీయుల్లోనే వర్ణ వివక్ష ఎక్కువ గా కనిపిస్తుంటుంది. తెల్లగా ఉంటె అందంగా ఉన్నట్లు.. నల్లగా ఉంటె అందం లేనట్లు ఒక భావన చాలా మందికి ఉంటుంది. అయితే.. వీరందరికి సోషల్ మీడియా ద్వారా ఐషు అనే అమ్మాయి పాట ద్వారా వర్ణ వివక్ష గురించి వివరిస్తోంది. ఆ అమ్మాయి కథ ఏమిటో మనం ఇపుడు తెలుసుకుందాం.

aishu reddy 1 feature

గత కొన్నేళ్లు గా బ్యూటీ ప్రొడక్ట్స్ హెచ్చు స్థాయి లో పుట్టుకొచ్చాయి. నల్లగా ఉండేవారికి కష్టాలు కూడా పుట్టుకొచ్చాయి. నల్లగా ఉండేవారికి చాలా మంది పలు సూచనలు చేస్తూ ఉంటారు. ఆ క్రీం వాడితే ఛాయా బాగుంటుంది.. ఈ క్రీం వాడితే చర్మం మెరుస్తుంది వగైరాలు.. కానీ, ఇవన్నీ ట్రై చేసి.. ట్రై చేసి ఓ దశలో ఎంతగా విసుగు చెందుతారో.. ఎంతగా కాన్ఫిడెన్స్ ని కోల్పోతారో ఐషు స్వయం గా అనుభవించింది. అలాంటివారి కోసం తానేమైనా చేయాలనుకుంది.

aishu reddy

లాక్ డౌన్ టైం లో ఆమె తన డాన్స్ వీడియో లను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. ఎనర్జిటిక్ డాన్స్ గర్ల్ గా ఆమె పేరు తెచ్చుకుంది. చాలా మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. వారిలో ఆమెకు చాలా మంది తెల్లగా అవడానికి సూచనలు చేసేవారు. వారందరికీ ఓ పాట ద్వారా ఐషు తన అభిప్రాయాన్ని సున్నితం గా తెలియచేసింది. నల్లగా ఉండడం నా తప్పేమి కాదు.. అది నా అందాన్ని తగ్గించదు. తెల్లగా లేకపోవడం నా తప్పు కాదు. నలుపు కూడా అందమైనదే. నా శరీర రంగు గురించి ఎలాంటి శ్రద్ద తీసుకోవాలో నేను ఎవరిని అభిప్రాయాలూ అడగడం లేదు…శరీర రంగు కోసం బ్లీచింగ్ క్రీమ్స్ వాడాలంటూ సూచనలు చేయొద్దని ఆమె సున్నితం గా కోరింది.

aishu reddy

ఇంకా ఈ వీడియో ను తనకోసమే చేయలేదని.. తనలాంటి వాళ్ళు బాధపడకూడదనే చేసినట్లు పేర్కొంది. చిన్నతనం లోఈ సమస్య పై పోరాడినట్లు తెలిపింది. తన చిన్నప్పుడు కూడా చాలా మంది సూచనలు చేసేవారని, పసుపు ముద్దలు పూసుకోవడం, ఫెయిర్ నెస్ క్రీములు వాడటం వంటివి చేసేదానినని చెప్పుకొచ్చింది. ఒక దశలో తనపై తానూ కాన్ఫిడెన్స్ ను కోల్పోయినట్లు తెలిపింది. ఆ తరువాత ఎవరు ఏమి చెప్పినా పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది. డాన్స్ ని అమితం గా ఇష్టపడే నేను డాన్స్ పై పట్టు సాధించడానికి ప్రయత్నించానని పేర్కొంది. నల్లగా ఉన్నవారు చాలా మంది వర్ణ వివక్షను ఎదుర్కొంటున్నారని.. దీనికి వ్యతిరేకంగా ఎవరికీ వారు తమ అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Aishu (Aishwarya) (@aishuadd)