Ads
*ఆధార్ కార్డు వలన భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి. ఇది తప్పకుండా అందరికి షేర్ చేయండి.* ఒక కస్టమర్ హోటల్ కి ఫోన్ చేసి బిర్యాని ఆర్డర్ ఇస్తున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ చూడండి.
Video Advertisement
ఆపరేటర్ : హలో… ప్యారడైజ్ హోటల్ …
కస్టమర్: ఒక ఆర్డర్ తీసుకోండి ప్లీజ్..?
ఆపరేటర్: మొదట మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్
కస్టమర్: ఒక నిమిషం… నా ఆధార్ నెంబర్ “1234 5678 9012 ”
ఆపరేటర్: ఓకే మీ పేరు శ్రీకాంత్ .. నెంబర్ 17, గాంధీ రోడ్, శ్రీనగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నారు. మీ ఇంటి ఫోన్ నెంబర్ 408423666, ఆఫీస్ నెంబర్ 76452302, మొబైల్ నెంబర్ 0142662566. ఇప్పుడు మీరు మీ మొబైల్ నుండి మాకు కాల్ చేశారు…
కస్టమర్: వావ్.. ఇన్ని నెంబర్లు ఎలా సార్ తెలుసుకున్నారు..?
ఆపరేటర్: కేవలం ఒక్క ఆధార్ నంబర్ తో మీ డిటైల్స్ అన్ని తెలిసిపోతాయి sir
కస్టమర్: గుడ్.. నాకు ఒక చికెన్ ఫ్రై బిర్యాని ఆర్డర్ తీసుకుంటారా..?
ఆపరేటర్: సార్ .. నాకు తెలిసినంత వరకు అది వద్దనే చెప్తాను సార్..
కస్టమర్: ఏ.. ఎందుకు ?
ఆపరేటర్: మీ మెడికల్ రిపోర్ట్స్ ని బట్టి మీకు కొలెస్ట్రాల్ లెవల్ ఎక్కువగా ఉంది..
కస్టమర్: What..? అప్పుడు నేను ఏమి తినాలి..?
ఆపరేటర్: మా దగ్గర ఉండే Low fat వెజిటబుల్ బిర్యాని ట్రై చేసి చూడండి సార్.. అది బాగా నచ్చుతుంది..
కస్టమర్: నాకు నచ్చుతుంది అని మీకు ఎలా తెలుసు..
ఆపరేటర్: పోయిన వారం మీరు బాబాయ్ హోటల్ లో వెజిటబుల్ బిర్యాని తిన్నారు సార్..
కస్టమర్: మై గాడ్.. చాలు సామీ చాలు.. మీరు చెప్పిన వెజిటబుల్ బిర్యాని ఫ్యామిలీ సైజ్ లో ఇవ్వండి..
ఆపరేటర్: ఖచ్చితంగా సార్… పది మంది ఉన్న మీ కుటుంబానికి అది ఖచ్చితంగా సరిపోతుంది. బిల్ అమౌంటు 2350 రూపాయలు సార్..
కస్టమర్: నేను నా క్రెడిట్ కార్డ్ లో నేను pay చేయచ్చా..?
ఆపరేటర్: లేదు సార్.. మీరు క్యాష్ రూపంలోనే చెల్లించాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎప్పుడో అయిపోయింది. అదీకాకుండా జనవరిలో మీరు 1,50,648 రూపాయలు క్రెడిట్ కార్డ్ బాకీ పెట్టి ఉన్నారు.
కస్టమర్: నేను ఎలాగైనా క్యాష్ రెడీ చేస్తాను. మీరు బిర్యాని పంపండి. ఎంత టైం పడుతుంది..?
ఆపరేటర్: 45 నిమిషాలు పడుతుంది సార్.. అంతసేపు మీరు వెయిట్ చేయలేకపోతే మీ బైక్ లో వచ్చి మీరే తీసుకెళ్ళచ్చు సార్..
కస్టమర్: What.?
ఆపరేటర్: మీ ఆధార్ కార్డు ప్రకారం మీ దగ్గర ఒక బైక్ ఉంది. దాని నెంబరు 1122.
కస్టమర్: మీరు ప్రకటన లో చెప్పిన విధంగా ఆ మూడు ఫ్రీ కోక్ బాటిల్స్ కలిపి పంపండి.
ఆపరేటర్: బిర్యాని మాత్రమే పంపిస్తాం సార్ మీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం మీ ఆరోగ్యాన్ని దృష్ఠిలో ఉంచుకుని మీకు ఆ కోక్ ని ఇవ్వలేం సార్..
కస్టమర్: ***%&$%%### You $##$%%@!))) (ఇక్కడ రాయలేని బూతులు)
ఆపరేటర్: సార్ .. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి సార్.. ఇలానే ఒక పోలీస్ దగ్గర బూతులు తిట్టినందుకు కోర్టు మీకు రెండు నెలల జైలు శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించింది మర్చిపోయారా?
కస్టమర్: ఢాం అని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.
చదివేటపుడు చూసేటపుడు ఇది సరదాగానే ఉంటుంది కానీ ప్రభుత్వం ప్రతీ దానికి ఆధార్ కార్డ్ ను లింక్ పెడుతుంది దీని కోసమే. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి. ఇది తప్పకుండా అందరికి షేర్ చేయండి.*
source: whatsapp forward message
End of Article