డార్క్ చాక్లెట్ వలన ఈ 9 లాభాలు పొందచ్చట.. మరి ఎంత తీసుకోవాలంటే..?

డార్క్ చాక్లెట్ వలన ఈ 9 లాభాలు పొందచ్చట.. మరి ఎంత తీసుకోవాలంటే..?

by Megha Varna

Ads

చాలా మంది డార్క్ చాక్లెట్ ను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్, జింక్ వంటివి మనకి ఎన్నో లాభాలను కలిగిస్తాయి.

Video Advertisement

డార్క్ చాక్లెట్ ని తయారు చేయడానికి కోకో పౌడర్ ని ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే డార్క్ చాక్లెట్ వల్ల కలిగే లాభాలు, ఎంత డార్క్ చాక్లెట్ ని తీసుకోవచ్చు అనే విషయాలను చూద్దాం.

#1. పోషక పదార్థాలు లభిస్తాయి:

డార్క్ చాక్లెట్ లో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

#2. బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది:

డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.

#3. హృదయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి:

డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడానికి అవుతుంది.

#4. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది:

డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అలానే బ్లడ్ ఫ్లో బాగుంటుంది.

#5. ఫ్రీరాడికల్స్ నుండి పోరాడుతుంది:

డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఫ్రీరాడికల్స్ ఉండి పోరాడుతుంది.

#6. కాలుష్య కారకాలు తొలగిపోతాయి:

శరీరంలోనే కాలుష్య కారకాలను తొలగించడానికి కూడా డార్క్ చాక్లెట్ బాగా ఉపయోగపడుతుంది.

#7. యూవీ రేస్ నుండి కాపాడుతుంది:

యూవీ రేస్ వల్ల చర్మం దెబ్బతింటుంది. అటువంటప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడడానికి అవుతుంది.

#8. కొవ్వు కరుగుతుంది:

డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల కూడా ఒంట్లో ఉండే కొవ్వు కరుగుతుంది.

#9. నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి:

డార్క్ చాక్లెట్లు తినడం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది.

ప్రతిరోజు ఎంత డార్క్ చాక్లెట్ ని తీసుకుంటూ ఉండాలి..?

ప్రతి రోజూ 10 గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పది గ్రాములు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.


End of Article

You may also like