యావరేజ్ టాక్ తో హిట్ కొట్టిన దాస్.. ఎంత లాభం వచ్చిందంటే..??

యావరేజ్ టాక్ తో హిట్ కొట్టిన దాస్.. ఎంత లాభం వచ్చిందంటే..??

by Anudeep

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా పాపులర్ హీరోగా సత్తా చాటుతోన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు తాజాగా ‘దాస్ కా ధమ్కీ’ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

Video Advertisement

 

 

తన స్వీయ దర్శకత్వంలో.. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ దీనికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

das ka dhamki movie total collections..!!

ఉగాది రోజు విడుదలైన ధమ్కీ కొంత నెగిటివ్ టాక్ అందుకున్నప్పటికి మంచి కలెక్షన్స్ అందుకుంది. సినిమాలో విశ్వక్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరొకవైపు మాస్ హీరోగా యాక్షన్ సీన్స్ లో కూడా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తం గా రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసింది. అయితే ఈ మూవీ కి మొదట నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా టాక్ ను బట్టి పెద్దగా ఓపెనింగ్స్ రాకపోవచ్చని అందరూ అనుకున్నారు. రివ్యూలు తక్కువగా వచ్చినా కూడా నెంబర్స్ మాత్రం తగ్గలేదు.

das ka dhamki movie total collections..!!

ఈ మూవీ 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 4 రోజుల్లో టార్గెట్ ను పూర్తి చేసింది. టోటల్ రన్ లో 3.76 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపింది. వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత కొంచం స్లో డౌన్ అయినా కూడా అప్పటికే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా 11 .76 కోట్ల షేర్ 23 .20 కోట్ల గ్రాస్ ను సాధించింది.


End of Article

You may also like