నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

Video Advertisement

దసరా చిత్రం కోసం నాని తన లుక్స్ ని పూర్తిగా మార్చుకున్నాడు. కంప్లీట్ మాస్ హీరోగా మారిపోయాడు. తన తొలి పాన్ ఇండియా చిత్రం అయిన ఈ మూవీ లో నాని తన గత చిత్రాలకు భిన్నంగా కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. నాని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ట్రైలర్ లో కనిపించాడు. నాని ఇందులో ధరణిగా పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. రా అండ్‌ రస్టిక్‌గా ఈ ట్రైలర్‌ సాగింది.

minus points in nani dasara trailer

ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి U /A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. అయితే సెన్సార్ టాక్ ని బట్టి ఈ చిత్రం హిట్ అయ్యేలా ఉందని సమాచారం. సెన్సార్ సభ్యులు మూవీ పట్ల పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. దసరా చిత్రంలో హీరో నాని, కీర్తి సురేష్ ల నటన ప్రధాన హైలెట్స్ అంటున్నారు. అలాగే ఈ మూవీ లో కొన్ని డైలాగ్స్ కి మ్యూట్ వేశారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా రన్ టైం కూడా లాక్ అయ్యింది. ఈ చిత్రం రెండు గంటల, 29 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది.

story of nani's dasara movie..!!

పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో నాని దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. చెన్నై, బెంగుళూరు వెళ్లిన టీం నెక్స్ట్ నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఈ రెండు వారాలు సినిమాను పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయనున్నారు. మలయాళ నటుడు షైన్ టామ్ విలన్ గా నటిస్తున్నారు.