టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా దసరా . డెబ్ల్యు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మొత్తాన్ని నాని తన భుజాలపై మోశాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. వెన్నెల పాత్రలో నటించిన కీర్తి సురేష్ కూడా తన పాత్రకి తగిన న్యాయం చేసింది.

Video Advertisement

అయితే నాని దసరా మూవీ ఫస్ట్ లుక్ ముహూర్తంలో విడుదలైందో తెలియదు కానీ.. అప్పట్నుంచి ఈ సినిమాకు పుష్ప ఫీవర్ పట్టుకుంది. దీనికి పుష్పతో పోలికలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఆ మూవీ టీజర్ కూడా చూడ్డానికి పుష్పలా ఉందంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. అలాగే ఇప్పుడు ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా పుష్ప తోనే పోలుస్తున్నారు. పుష్ప కంటే ఈ మూవీ చాలా బాగుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

dasara vs pushpa movie collections..!!

కంటెంట్ పరం గా చూసుకుంటే పుష్ప మూవీ ని సెకండ్ పార్ట్ తియ్యాలి అని చెప్పి చాలా లాగ్ చేసారు. కానీ దసరా మూవీ ని కరెక్ట్ గా తియ్యడం తో సూపర్ హిట్ అయ్యిందని అంటున్నారు. అంత కాకుండా జెదసరా మూవీ లో పాత్రల చిత్రీకరణ కూడా పుష్ప కంటే చాలా బావుందని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

dasara vs pushpa movie collections..!!

అలాగే దసరా, పుష్ప చిత్రాలకు మధ్య కంపారిజన్ వస్తుండటం తో నాని ఈ అంశం పై చాలా సార్లు స్పందించారు. కానీ ఈ సినిమాల మధ్య పోలికలు తీయడం మాత్రం మానలేదు నెటిజన్లు. అయితే దసరా మూవీ రూపాయలు బిజినెస్ చేసిందని సమాచారం. అయితే ఈ మూవీ రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ.28.88 కోట్ల షేర్, 52 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం రెండు రోజులకు గాను 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.