”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మూవీలో డిలీట్ చేసిన ఈ సీన్ గురించి తెలుసా?

”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మూవీలో డిలీట్ చేసిన ఈ సీన్ గురించి తెలుసా?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలయికలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అచ్చమైన పల్లెటూరి కథతో తీసిన చిత్రం ఇది.

Video Advertisement

ఈ చిత్రం  2013లో సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయ్యింది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ  ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఈ మూవీది  సెపరేట్ ట్రెండ్ అని చెప్పవచ్చు.టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలు వస్తున్నాయి. కానీ దానికి  కారణం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీలో పెద్దోడిగా వెంకటేష్, చిన్నోడిగా మహేష్ నటించి మెప్పించారు. మహేష్ బాబుకు జంటగా హీరోయిన్ సమంత నటించగా, వెంకటేష్ కు జంటగా అంజలి నటించింది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రంలో కుటుంబాలు, కటుంబ సభ్యుల మధ్యన ఉండే అనుబంధాల గురించి చాలా బాగా చూపించారు. ఈ చిత్రంలోని పాత్రలను చాలా సహజంగా చూపించారు. ఎంతలా అంటే ఈ మూవీ మన ఇంట్లో లేదా పక్కింట్లోనో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక మహేష్, వెంకటేష్ నటన నిజంగా అన్నతమ్ముళ్ళేమో అన్న  విధంగా నటించారు. వారి నటన ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అన్నతమ్ముళ్ళ మధ్య వచ్చే సీన్స్ వారి ఎమోషన్స్ ను కూడా చక్కగా చూపించారు.
కుటుంబ పెద్దగా ప్రకాష్ రాజ్, ఆయన భార్యగా జయసుధ తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఆమె అత్తగా, హీరోలకి బామ్మగా సీనియర్ నటి రోహిణి హాట్టంగడి నటించారు. అత్తకోడళ్ల మధ్య అనుబంధాన్నిచక్కగా చూపించారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారు. అయితే ప్రస్తుతం డిలీట్ చేసిన ఆ సీన్ ను సోషల్ మీడియాలో నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.
ఆ సన్నివేశంలో ఒక మహిళ జయసుధను మీ అత్తగారు మీతోనే  ఉంటుందా అని అడిగితే, దానికి జయసుధ ఆమె మాతో కాదు మేమే మా అత్తగారితో ఉంటున్నాం. ఆమె ఉండమంటే ఉంటాం. లేదంటే లేదు అంతా మా అత్తగారి ఇష్టమే అని చెప్తుంది. ఈ సీన్ చూసినవారు నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CqXpdo7pnPM/?fbclid=IwAR1sayWgfYMfeTUHRMVolwcS2fWSKbfOo2c_SBne37qVegeFODaofM2ViA4

Also Read: “వేదం” లో “మంచు మనోజ్” పక్కన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా..?

 

 


End of Article

You may also like