Nene Vasthunna Review: “ధనుష్” నటించిన నేనే వస్తున్నా సినిమా హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Nene Vasthunna Review: “ధనుష్” నటించిన నేనే వస్తున్నా సినిమా హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Anudeep

Ads

  • చిత్రం : నేనే వస్తున్నా
  • నటీనటులు : ధనుష్, ఇందూజ, ఎల్లి అవ్రామ్, ప్రభు, తులసి, శరవణ సుబ్బయ్య, తదితరులు
  • నిర్మాత : కలైపులి ఎస్ థాను, గీతా ఆర్ట్స్ (తెలుగులో)
  • దర్శకత్వం : సెల్వ రాఘవన్
  • సంగీతం : యువన్ శంకర్ రాజా
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 29, 2022

స్టోరీ :

Video Advertisement

హీరో (ధనుష్) కు ఊటీలో ఒక రిసార్ట్ ఉంటుంది. అక్కడ తన కుటుంబం తో నివసిస్తూ ఉంటాడు. తనలాగే ఉండే ఒక వ్యక్తి తో అతనికి వైరం ఏంటనేదే మిగిలిన కథ.

dhanush nene vasthunna telugu-movie-story-review-rating
రివ్యూ:
తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయిన్ ఉన్న విషయం తెలిసిందే.. ఆయన సినిమాలు తమిళ్ తోపాటు తెలుగులోనూ డబ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇదివరకే రిలీజైన టీజర్, సాంగ్స్ అన్ని సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసాయి.“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

dhanush nene vasthunna telugu-movie-story-review-rating
అయితే తాజాగా వచ్చిన ఈ చిత్రం లో ఈయన ద్విపాత్రాభినయం చేసారు. హీరోగా, విలన్ గా ధనుష్ కనిపిస్తారు. సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. సినిమా లో కనిపించే సన్నివేశాలు కాసేపు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి. కానీఫస్ట్ హాఫ్ లో డెడ్ స్లో నేరేషన్ ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడుతుంది. హీరో స్టోరీ తో కథ కాస్త ఆసక్తి కరం గా మారుతుంది.సినిమాలో కొన్ని ట్విస్ట్‌లు కొంత వరకు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ధనుష్ రెండు పాత్రల్లోనూ తన నటనను కనబరిచాడు. ప్రతినాయకుడి పాత్రలో జీవించేసారు ధనుష్.

dhanush nene vasthunna telugu-movie-story-review-rating

హీరోయిన్లు తమ పాత్రల మేరకు నటించారు. సెల్వరాఘవన్ మరోసారి నటుడిగా తనదైన ముద్ర వేశారు మరియు మిగిలిన నటీనటులు బాగా చేసారు. సెల్వ రాఘవన్ తన మార్క్ చూపించడం లో విఫలం అయ్యారు.ఈ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఓం ప్రకాష్ ఊటీలోని కొన్ని అందమైన విజువల్స్‌ని బంధించారు. కొన్ని ఎక్స్‌ట్రీమ్ క్లోజప్‌లు మరియు కొన్ని బ్లాక్‌లు ప్రేక్షకులను ఆకర్షించాయి. యువన్ శంకర్ రాజా పాటలు తెలుగు, తమిళంలో కూడా మార్కును అందుకోలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో తనదైన ముద్ర వేశాడు.

ప్లస్ పాయింట్స్:

  • ధనుష్ నటన
  •  ఊటీలోని సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

  • ఎమోషన్స్ లేకపోవడం
  •  స్లో నరేషన్

రేటింగ్:

3 /5

ట్యాగ్ లైన్ :

ఓవరాల్ గా ‘నేనే వస్తున్నా’ డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే.


End of Article

You may also like