నటీనటులకు ఓ సౌలభ్యం ఉంటుంది. షూటింగ్ నిమిత్తం వారు వివిధ ప్రాంతాలకు వెళ్లొచ్చు. అక్కడి అందమైన ప్లేసులు చూడొచ్చు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి కల్చర్ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇష్టం ఉంటే.. కాసేపు అక్కడి కల్చర్‌లో కూడా భాగం అవ్వొచ్చు. అలానే ఓ నటి తాజాగా తెలంగాణలోని కరీంనగర్ కి వెళ్ళింది. అక్కడ కల్చర్ చూసి ఫిదా అయ్యింది. ఆ ప్రాంతంలోని స్పెషల్ వంటకాలు రుచి చూడటం తో పటు ట్రాక్టర్ కూడా నడిపింది ఆ నటి. ఇక ఆ తర్వాత బస్తాలోకి పత్తి తొక్కింది. అదే అండి మన ఏరియాల్లో పత్తి తొక్కుడు అంటారు కదా అది..

Video Advertisement

 

 

ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా.. ధన్య బాల కృష్ణ. ఆమె తెలుగులో 2012లో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ ఆమె మొదటి చిత్రం. ఆ తర్వాత ‘రన్ రాజా రన్, రాజుగారి గది, చిన్నదాన నీకోసం, భలే మంచిరోజు, జయ జానకి నాయక, సాఫ్ట్‌వేర్ సుధీర్’ తదితర చిత్రాల్లో కనిపించింది. తెలుగులో కంటే తమిళం లో ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించింది. కర్ణాటకకు చెందిన ధన్య తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు.

dhanya balakrishnan new post..!!

ఆమె నటించిన లేటెస్ట్ మూవీ జగమే మాయ డిసెంబర్ 15 నుంచి.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఓ షూటింగ్ నిమిత్తం కరీంనగర్ వెళ్లిన ధన్య ఇలా అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో పంచుకుంది. అయితే హీరోయిన్‌గా సక్సెస్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే భవిష్యత్‌లో డైరెక్టర్ కూడా అవుతానంటోంది. ఇప్పటికే ఒక తమిళ చిత్రానికి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు.

dhanya balakrishnan new post..!!

ధన్య వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఆమె తమిళ డైరెక్టర్ బాలాజీ మోహన్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే బాలాజీ మోహన్ కి ముందు ఒక వివాహం కాగా ధన్య ని రెండో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని మరో నటి కల్పికా గణేష్‌ బయట పెట్టడం తో వివాదం మొదలైంది. ఈ విషయాన్ని తాజాగా నిర్ధారించిన బాలాజీ మోహన్, తన పర్సనల్ లైఫ్‌కు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు టీవీ నటి కల్పికా గణేష్‌ పై ఆయన పిటిషన్ దాఖలు చేశారు