ఈ కోడి మాంసం కిలో రూ.900 , ఒక్క గుడ్డు రూ.50 …”ధోని” కొత్త బిజినెస్ ప్లాన్ మాములుగా లేదుగా.!

ఈ కోడి మాంసం కిలో రూ.900 , ఒక్క గుడ్డు రూ.50 …”ధోని” కొత్త బిజినెస్ ప్లాన్ మాములుగా లేదుగా.!

by Harika

Ads

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్గానిక్ ఫౌల్ట్రీ ఫామ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని భీమ్ లాంచల్ ప్రాంతానికి చెందిన కడక్ నాథ్ కోళ్ళని రాంచి లోని తన ఫామ్ హౌస్ లో పెంచుతున్నాడు. కడకనాథ్ కోళ్లకి ఒక ప్రత్యేకత ఉంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ, ప్రతికూల వాతావరణంలో పరిస్థితులను సైతం తట్టుకుంటాయి. అలాగే ఈ కోళ్ల చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నలుపు రంగులో ఉంటుంది.

Video Advertisement

dhoni kadaknath chicken rates

ఆరు నెలల వయసు దాటాక గుడ్లు పెడతాయి. వీటి గుడ్లను ఇంక్యుబేటర్ లో ఉంచి పొదిగిస్తారు. ఒక్కొక్క కోడి ఏడాదిలో 100కు పైగా గుడ్లు పెడుతుంది. ఒక్క కోడి గుడ్డు ఖరీదు రూ.50 ప్రస్తుతం మార్కెట్లో కడక్నాథ్ కోడి మాంసం కిలో 700 నుంచి 900 పైగానే ఉంది. కేవలం ఈ కోడి మాంసమే కాదు గుడ్డు కూడా చాలా కాస్ట్లీ. కోడి పిల్ల పుట్టిన తర్వాత రోజులను బట్టి ధర ఉంటుంది. సాధారణ బాయిలర్ కోళ్ల కంటే కడక్ నాథ్ కోడి మాంసంలో ప్రోటీన్లు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వాటి గుడ్డులో కూడా అత్యధికంగా ప్రోటీన్లు, లినోలెయిక్ యాసిడ్లు ఉంటాయి. అలాగే వీటి నిర్వహణకి ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు. పాడైన కూరగాయలు పంట పొలాల్లో ఉండే కీటకాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి.

dhoni kadaknath chicken rates

మధ్యప్రదేశ్ లోని గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ కోళ్లు పెరుగుతాయి. 2018లో ఈ గోళ్ళకు జి ఐ ట్యాగ్ కూడా దక్కింది. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన తర్వాత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. రాంచీలోని తన 43 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతిలో పంటలను కూడా సాగు చేస్తున్నాడు ధోని. పాలు, చేపల ఉత్పత్తి, బాతుల పెంపకం కూడా ఇక్కడ చేస్తారు. వాణిజ్య ప్రకటన ద్వారా ఆదాయం సంపాదిస్తున్న ధోని మంచి బిజినెస్ మైండెడ్ ఉన్న వ్యక్తి అని అందరికీ తెలిసిందే. 2020 నాటికి ఎమ్మెస్ ధోని నికర సంపద 760 కోట్లని అంచనా.


End of Article

You may also like