సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా చూసారా.? 6 నెలల తర్వాత అలా..!

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా చూసారా.? 6 నెలల తర్వాత అలా..!

by Harika

ఇటీవల ఇటీవల కాలంలో చాలా సినిమాలు ఎటువంటి ఎటువంటి ప్రకటన లేకుండా నేరుగా ఓటీటీలోకి విడుదల అయ్యి షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు అలా సైలెంట్ గా ఓటీటీ లో విడుదల అయ్యి అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అప్పుడెప్పుడో జూన్ చివర్లో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఒకే రకంగా చెప్పాలంటే పూర్తిగా ఈ మూవీ ని పూర్తిగా పక్కనబెట్టేశారని చెప్పవచ్చు. ఆగస్టులో ఓటీటీలో రిలీజ్ అని అనౌన్స్ చేశారు.

Video Advertisement

ఎందుకో ఇదీ వాయిదా పడింది. దాదాపు నాలుగు నెలల తర్వాత అంటే ఇప్పుడు తాజాగా ఓటీటీలో ఈ సినిమాని తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా మరేదో కాదు. ఫహాద్ ఫాజిల్ హీరోగా ధూమమ్. ఈ మూవీని దక్షిణాదిలో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో తెలుగు రిలీజ్ వాయిదా వేశారు. అదే సమయంలో కన్నడ, మలయాళ భాషల్లో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు వెర్షన్ విడుదలని పూర్తిగా పక్కనబెట్టేశారు. అయితే ఈ ఏడాది జూన్ 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాని రెండు వారాల్లోనే అంటే ఆగస్టు 4నే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కానీ ఏమైందో ఏమో గానీ ఓటీటీ స్ట్రీమింగ్ కూడా వాయిదా వేశారు. అలా ఈ మూవీ గురించి అందరూ మర్చిపోయారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఆపిల్ టీవీ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ధూమమ్ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో చాలామంది అభిమానులు నెటిజన్స్ ఏంటిది ఒక ప్రకటన కూడా ఇవ్వకుండానే డైరెక్ట్ గా ఓటీటీ లోకి సైలెంట్ గా విడుదల చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


You may also like

Leave a Comment