నందమూరి నట సింహం బాలకృష్ణ మూవీ అంటే నందమూరి అభిమానులే కాకుండా ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తి  ఎదురుచూస్తారు. బాలయ్య పని అయిపోయిందని అనుకున్న టైమ్ లో ‘సింహ’ చిత్రంతో హిట్ ఇచ్చి బాలయ్య తానెంటో నిరూపించాడు.

Video Advertisement

ఆ తర్వాత వచ్చిన లెజండ్ సినిమాతో బాలయ్య తన వయసు పెరిగే కొద్దీ ఆయన ఎనర్జీ కూడా పెరుగుతుందని నిరూపించాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వచ్చిన అఖండ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. మరో వైపు బాలయ్య అన్ స్టాపబుల్ షోతో తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్నారు. ఈ షోతో  నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆడియెన్స్ కూడా బాలయ్య హోస్టింగ్ కి ఫిదా అయ్యారు.
dialogue-leaked-from-nbk-108ఇక ఈ ఏడాది సంక్రాంతి కనుక విడుదలైన వీర సింహ రెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గోపి చంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇదే జోష్ లో బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.
balakrishnaఅయితే ఈ మూవీలోని డైలాగ్ ఒకటి తాజాగా లీక్ అయినట్టుగా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ”నన్ను వేటాడాలంటే వేటగాడు గుండెల్లో దమ్ము ఉండాలి. పొరపాటున కూడా వాడి కళ్ళలో భయం కనబడితే ఆ వేటగాడే నా వేట కత్తికి బలి అవుతాడు” అనే డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఇలాంటి డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు సాటి లేరనే విషయం తెలిసిందే. ఈ డైలాగ్ తో మూవీ మీద అంచనాలు మరింత పెరిగాయి.

Also Read: “హలో” సినిమాలో హీరో చిన్నప్పటి రోల్ చేసిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?