నిఖిల్ సిద్దార్థ్ నటించిన 18 పేజెస్ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA 2 సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కుమారి 21 ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం సూపర్ హిట్ కావడం తో ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల చేసేందుకు చాలా కాలమే పట్టింది.

Video Advertisement

 

 

అయితే కార్తికేయ 2 చిత్రం సూపర్ హిట్ కావడం తో 18 పేజెస్ స్టోరీ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సుకుమార్ చూసి కొన్ని సన్నివేశాల విషయంలో ఆయన అంతగా సంతృప్తి చెందకపోవడంతో, ఆ సీన్స్ ను రీ షూట్ చేయాలనే చెప్పారట. నిఖిల్ కూడా ఓకే చెప్పడంతో చిన్న చిన్న మార్పులు చేశారట.. అందుకే ఈ చిత్రం విడుదల అయ్యేందుకు చాలా సమయం పట్టిందని తెలుస్తోంది.

did 18 pages movie story changed..??

అయితే మూల కథలో ఎలాంటి మార్పులు చేయలేదని.. కానీ చిన్న చిన్న అడిషన్స్ అయితే చేశామని దర్శకుడు ప్రతాప్ వెల్లడించారు. ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రాణమని.. అది ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుందని ఆయన తెలిపారు. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా తరువాత తన కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చిందని.. ఇకపై స్పీడ్ పెంచుతానని అన్నారు. తన నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ లో ఉంటుందని తెలిపారు ప్రతాప్.

 

did 18 pages movie story changed..??
డిఫరెంట్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమాలో ఎప్పుడూ చూడని ఒక ట్విస్ట్ ఉంటుంది అని కూడా చిత్ర యూనిట్ తెలిపింది. ఇక సుకుమార్ రాసిన కథ కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 16 కోట్లు అయినట్లుగా తెలుస్తోంది. ఇక నాన్ థియేట్రికల్ గా ఈ సినిమా దాదాపు 22 కోట్ల వరకు వెనక్కి తీసుకువచ్చింది. అంటే పెట్టిన పెట్టుబడిలో సినిమా విడుదల కాకముందే దాదాపు 6 కోట్ల వరకు ప్రాఫిట్ అందించింది అని సమాచారం.