“కాంతారా” సినిమాలో లాగా… ఆ తెగ వారు ఆత్మలతో మాట్లాడతారా..?? ఇదంతా నిజమేనా..?

“కాంతారా” సినిమాలో లాగా… ఆ తెగ వారు ఆత్మలతో మాట్లాడతారా..?? ఇదంతా నిజమేనా..?

by Anudeep

Ads

‘కాంతారా’.. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న కన్నడ చిత్రం. భాష తో సంబంధం లేకుండా ప్రతి చితా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది చిత్రం. హీరో గా.. దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన అద్భుతానికి అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. మరుగున పడిపోతున్న కళలకి దృశ్యరూపం ఇచ్చిన రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Video Advertisement

అయితే ఈ సినిమా చూసిన తర్వాత.. ఇలా నిజంగా ఆత్మలతో మాట్లాడతారా.. వారు చెప్పినట్టే అన్ని జరుగుతాయా అని ప్రతి ఒక్కరు సందేహ పడుతున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత గ్రామం లో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా తీస్తున్నట్లు రిషబ్ శెట్టి గతం లో చెప్పారు. కర్ణాటకలోని ఓ తెగకు సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో కుటుంబ బంధాలు, అనుబంధాలు అన్నీ స‌న్నివేశాల‌ప‌రంగా చూపించ‌గ‌లిగాడు దర్శకుడు.

did batt people really spoke with ghosts..??
కర్ణాటక లోని ఒక ప్రాంతం లో బంట్ అనే తెగ వారు నివసించేవారు. వీరి భాష తుళు. అయితే వీరు ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడి మతాలు కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఎక్కడ ఉన్నా కానీ.. కంబళ క్రీడను, భూత్ కోలా నృత్యాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ నృత్యాన్ని మనం కాంతారా సినిమాలో చూసాం. ప్ర‌ధానంగా ముగింపు స‌న్నివేశంలో రిషబ్ శెట్టి నృత్యాలు, నటన సినిమాకి హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు.

did batt people really spoke with ghosts..??
ఈ తెగకు చెందిన వారు డాన్స్ చేస్తూ వారి కులదైవాన్ని పూజిస్తూ ఉన్న సమయం లో వారి పూర్వీకుల ఆత్మలు వాళ్ళను ఆవహించి జరగబోయేవి చెబుతారని భావిస్తారు. వాటిని ఆ కుటుంబీకులు తప్పని సరిగా పాటిస్తారు.

did batt people really spoke with ghosts..??
వీటిని నేపథ్యంగా తీసుకున్న దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారా సినిమా ముగింపు స‌న్నివేశాల్లో దేవుడు ఆవ‌హించే సీన్‌లోనూ ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేశాడ‌నే చెప్పాలి. నిజ జీవితం లో జరిగిన సంఘటనలకు దృశ్యరూపం ఇచ్చిన రిషబ్ శెట్టి .. ప్రేక్షకులను ఈ చిత్రం తో ఒక అద్భుత లోకంలోకి తీసుకెళ్లాడు.


End of Article

You may also like