బిగ్ బాస్ తెలుగు 6 లో గీతూ రాయల్ ఎలిమినేషన్ కి అసలు కారణం ఇదేనా..? పుష్ప – 2 లో ఛాన్స్..?

బిగ్ బాస్ తెలుగు 6 లో గీతూ రాయల్ ఎలిమినేషన్ కి అసలు కారణం ఇదేనా..? పుష్ప – 2 లో ఛాన్స్..?

by Anudeep

Ads

ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గీతూ రాయల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరరీ తెలిసిందే. అయితే టాప్ 5 లో లేదా టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటున్న గీతూ రాయల్ ఊహించిన విధంగా 9వ వారం ఎలిమినేట్ అయింది.

Video Advertisement

ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ లలో వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన గీతూ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఈ పాపులారిటీ తోనే ఆమె బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. అయితే అనూహ్యం గా ఎలిమినేట్ అయిన గీతూ చాలా బాధ పడుతూ బిగ్ బాస్ హౌస్ ను వీడింది.

DID GEETHU ROYAL GETS CHANCE IN PUSHPA 2
అయితే.. బిగ్ బాస్ కి వెళ్లడం వరకూ బాగానే ఉంది. కానీ.. గీతూ బయటికి వచ్చిన కారణం వేరే ఉందట. అదేంటంటే.. బిగ్ బాస్ కంటే ముందు గీతూ.. జబర్దస్త్ లో పుష్ప స్కిట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్కిట్స్ తో చిత్తూరు యాసను బాగా పాపులర్ చేసింది. ఆ స్కిట్ తోనే గీతూకి లేడీ కమెడియన్ గా మంచి పేరొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ నుండి బయటకి రాగానే ఖాళీ లేకుండా.. వచ్చే ముందే పుష్ప 2లో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.

DID GEETHU ROYAL GETS CHANCE IN PUSHPA 2
జబర్దస్త్ లో చేసిన పుష్ప స్కిట్ వల్ల గీతూ.. పుష్ప 2లో అవకాశం అందుకుందని.. గీతూ యాస, టాలెంట్ చూసి ఆమెను పుష్ప 2 టీమ్ అప్రోచ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో గానీ క్లారిటీ అయితే రావాల్సి ఉంది.


End of Article

You may also like