అదేంటి “కీరవాణి” గారు.. “బాహుబలి” లో బిజీఎం కాపీ ట్యూన్ అనే విషయం తెలియదే..?

అదేంటి “కీరవాణి” గారు.. “బాహుబలి” లో బిజీఎం కాపీ ట్యూన్ అనే విషయం తెలియదే..?

by Anudeep

Ads

సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం అవుతూనే ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే, అలా ఒక సినిమాలో ఒక పాటకి వాడిన ట్యూన్ ఇంకొక సినిమాలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్యూన్ కి దగ్గరగా ఉంది.

Video Advertisement

 

 

కాకపోతే సినిమాల్లో ఇటువంటి విషయాలు జరిగితే అందరి దృష్టి వాటిపై ఉంటుంది కాబట్టి ఈజీ గా గుర్తిస్తారు. ఇక ప్రస్తుతం ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఈ ట్యూన్ అక్కడి నుంచి కాపీ కొట్టాడు అంటూ రోజుకొక వార్త వస్తుండటం మనం చూస్తూనే ఉంటున్నాం.. వాటిపై ట్రోల్స్, మీమ్స్ వైరల్ గా మారుతున్నాయి. అయితే తాజాగా బాహుబలి చిత్రం లో కాపీ ట్యూన్స్ వాడారు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

did keravani copied bahubali bgm from this ANR movie..!!

‘బాహుబలి’ మూవీ తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పారు జక్కన్న. ఈ మూవీ లో ప్రతి సీన్ ఎంతో శ్రద్దగా తీర్చిదిద్దారు రాజమౌళి. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన బలం. ఓ సన్నివేశాన్ని ప్రేక్షకుల గుండెకు హత్తుకునేలా చేసేది నేపథ్య సంగీతమే. సన్నివేశానికి తగ్గట్లు ఆయనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకి ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుస్తాయి. అయితే బాహుబలి మూవీ లోని బిజీఎం ని అక్కినేని నాగేశ్వర రావు హీరో గా నటించిన ‘కీలుగుఱ్ఱం’ చిత్రం నుంచి కాపీ చేసారంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

did keravani copied bahubali bgm from this ANR movie..!!

మీర్జాపురం రాజా దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కీలుగుఱ్ఱం. ఈ మూవీ కి ఘంటసాల సంగీత దర్శకుడు. అయితే ఈ మూవీ లోని బిజీఎం ని కీరవాణి కాపీ చేసి బాహుబలి మూవీ కి వాడుకున్నారు అంటూ ఈ రెండు మూవీస్ లోని క్లిప్పింగ్స్ ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒరిజినల్ మ్యూజిక్ ఇచ్చామని చెప్పుకున్నారు కదా.. ఇదేంటి..?? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు కీరవాణి ఆ మ్యూజిక్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఉండొచ్చు అంటూ ఆయన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/Coh1B1cB1ZY/?igshid=YmMyMTA2M2Y%3D


End of Article

You may also like