Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు దర్శకుడు కొరటాల శివ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా పరిచయమైన కొరటాల శివ ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి చిత్రంతో దర్శకుడిగా మారాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం మిర్చితోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించడంతో స్టార్ డైరెక్టర్ లో ఒకటిగా స్థానం సంపాదించుకున్నారు.
Video Advertisement
ఆ తర్వాత చేసిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలకు దర్శకత్వం వహించి వరుస విజయాలతో దూసుకుపోయారు. హ్యాట్రిక్ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నారు కొరటాల శివ. విజయాలకు పునాది గా నిలిచాడు కొరటాల.
ఇటీవల కాలంలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్య చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి గాను మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. ఆచార్య చిత్రం ఆయన సక్సెస్ కెరియర్ కు అడ్డుకట్ట వేసిన అని చెప్పవచ్చు. సినిమా డిజాస్టర్ గా నిలవడంతో కొరటాలకి ఉన్న మంచి పేరు డామేజ్ అయిపోయింది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మాణ సారథ్యం వహించారు.
కొన్ని అనివార్య కారణాలవల్ల మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్ర నిర్మాణంలో నుంచి మధ్యలో తప్పుకోవడం వల్ల కొరటాల శివ నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ చిత్ర నిర్మాణం చేపట్టడం వలన కొరటాల శివ తన ఆస్తులను అమ్ముకొనే స్థాయి వరకు వచ్చారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా వలన నష్టపోయిన బైయెర్స్ కి సైతం కొరటాల శివ తన ఆస్తులను ఒక భాగం అమ్మి నష్టపరిహారం చెల్లించారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం తన సన్నిహితులకు ఆచార్య చిత్రం హక్కులను విక్రయించడం ద్వారా పంపిణీలో పాల్గొన్నాడు కొరటాల శివ. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు సీడెడ్ కొనుగోలుదారులు కొరటాలశివ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దురాశ దుఃఖానికి మూల కారణం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆచార్య చిత్రంతో డిస్టిబూటర్స్ 15 కోట్ల నష్టాన్ని ఫైనల్ లాస్ గా ప్రకటించారు. అందులో కొరటాల శివ 4.75cr కొరటాల శివ భరిస్తున్నారు. మిగిలిన 1.25cr సీడెడ్ యొక్క ప్రధాన పంపిణీదారులు భరిస్తున్నారు. మిగిలిన తొమ్మిది కోట్ల రూపాయలను చిరంజీవి, కొరటాల తదితర చిత్రాల నుంచి సర్దుబాటు చేయబడతాయి అంటూ ప్రకటించారు.
End of Article