సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ని రూల్ చేస్తున్న హీరోలలో ఆయన నెంబర్ 1 లో ఉంటారు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మహేష్ బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు…ఆ తరువాత సినిమాలు దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సినిమాల నుంచి భారీగా డబ్బు సంపాదిస్తున్న మహేష్ బాబు మరోవైపు అడ్వర్టైజింగ్, బిజినెస్ వెంచర్స్ తో ఫైనాన్షియల్ గా చాలా ఎదిగిపోయారు. మహేష్ కు సంబంధించిన ఫైనాంటిల్ వ్యవహారాలన్నింటిని ఆయన భార్య నమ్రత చూసుకుంటారు.

Video Advertisement

గతేడాది సర్కారు వారి పాట చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మహేష్.. ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఒక చిత్రం చేయనున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. దీంతో రానున్న చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం లో పూజ హెగ్డే కథానాయిక. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా ఆగష్టు నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని పూర్తిగా చేంజ్ చేసారు. ఇప్పటికే ఆయన ఆ లుక్ తో బయట పలు మార్లు కనిపించారు.

did mahesh babu hiked his remunaration..??

అయితే మహేష్ బాబు వరుస హిట్స్ తో జోరు మీద ఉన్నారు. అయితే తన గత చిత్రం సర్కారు వారి పాటకు మహేష్ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా..త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రానికి మరింత పెంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

 

did mahesh babu hiked his remunaration..??
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి మొదటి రెండు వారాలు యాక్షన్‌ సీన్లు చిత్రీకరించేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించనుండగా. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి పనిచేయనున్నారు.ఈ చిత్రం తర్వాత మహేష్.. ఎస్ఎస్ రాజమౌళితో పనిచేయనున్న సంగతి తెలిసిందే.