టాలీవుడ్ బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పూజ హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది పూజా. తర్వాత ఆమెకు బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి.

Video Advertisement

మొదట్లో హృతిక్ రోషన్ రోషన్ తో ‘మొహంజొదారో’ చిత్రం లో నటించగా అది ప్లాప్ అయ్యింది. దీంతో ఆమె సౌత్ వైపు ద్రుష్టి సారించింది. నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’, వరుణ్ తేజ్ తో ‘ ముకుంద’ చిత్రాలు చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో చేసిన ‘ డీజే’ చిత్రం తో ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటి నుంచి పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోలతో వరుస చిత్రాలు చేస్తోంది పూజా.

did pooja hegde failed again in bollywood..

ఈ ఏడాది పూజా నటించిన అన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. ఈ లిస్ట్ లో రణ్వీర్ సింగ్ తో చేసిన ‘సర్కస్’ చిత్రం కూడా చేరింది. బాలీవుడ్ రీ ఎంట్రీ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది పూజా. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సర్కస్ చిత్రం కూడా ప్లాప్ కావడం తో.. సల్మాన్ తో చేస్తున్న ‘కిసి భాయ్ కా కిసి జాన్’ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం హిట్ అవ్వకపోతే పూజా బాలీవుడ్ లో స్టార్ అవ్వాలన్న కోరిక తీరదు. కానీ దర్శకుడు రోహిత్ శెట్టి పై ఉన్న అతి నమ్మకం తో స్టోరీ కూడా వినకుండా పూజా సర్కస్ చిత్రాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

did pooja hegde failed again in bollywood..

డిసెంబరు 23న పాన్ ఇండియా సినిమాగా విడుదలైన సర్కస్ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. ఏకంగా 2500 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేశారు. కానీ.. ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్లు కనీసం రూ.32 కోట్లు కూడా దాటలేదని బాక్సాఫీస్ లెక్కలు చెప్తున్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమాకి ప్రమోషన్స్‌తో సహా రూ.115 కోట్లు వరకూ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రణవీర్ సింగ్, పూజా హెగ్డేతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా నటించింది. కానీ ప్రేక్షకులు తిరస్కరించారు.