తమిళ నటుడు రవి రాఘవేంద్ర మనకు సుపరిచితుడే. ఈయన నటించిన తమిళ చిత్రాలు తెలుగులో విడుదలవ్వడమే కాక, పలు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లో కూడా ఈయన నటించారు. ఇటీవల ఈయన శర్వానంద్ హీరో గా వచ్చిన ఒకే ఒక జీవితం చిత్రం లో హీరో కి తండ్రి గా నటించారు.

Video Advertisement

అలాగే నాని నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు, మాధవన్ నటించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్, సిద్దార్థ్ నటించిన లవ్ ఫెయిల్యూర్ వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యారు. ఈయన తమిళం లో అనేక చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. అయితే ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈయన సూపర్ స్టార్ రజనికాంత్ భార్యకి సోదరుడు.

did you know who is this famous actor..!!

రవి రాఘవేంద్ర ప్రసిద్ధ నృత్య కళాకారిణి అయిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. రవి రాఘవేంద్ర కుమారుడు ఎవరో కాదు.. ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్. అనిరుధ్ తమిళం లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే తెలుగులో కూడా ఆయన గ్యాంగ్ లీడర్, బెస్ట్, తిరు, జెర్సీ, దర్బార్, అజ్ఞాతవాసి వంటి సినిమాలకు సంగీతం అందించాడు.

did you know who is this famous actor..!!

అనిరుధ్ సంగీతం అందించిన తెలుగు చిత్రాలు ప్లాప్ అయ్యాయి కానీ.. అతడి పాటలు మాత్రం సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే ఆ మధ్య ఫారెన్ కంట్రీ లో ఒక లైవ్ షో పెడితే దాదాపు పది కోట్ల రూపాయల మేర టికెట్స్ రూపం లో వచ్చాయట. అంత డిమాండ్ ఉంది ప్రస్తుతం అనిరుద్ కి. అనిరుద్ రవిచంద్రన్ మూడు పదుల వయసులో కి రాకముందే ఎన్నో సంచలన విజయాలను అందుకున్నాడు.

did you know who is this famous actor..!!

రజినీకాంత్ నుంచి శివకార్తికేయన్ వరకు ఏ హీరోకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో కూడా తనకి బాగా తెలుసు. సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే సత్తా ఉంది అనిరుధ్ కి. అనిరుధ్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ 30 కి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. అలాగే అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ మూవీ కి కూడా అనిరుధ్ ఏ సంగీత దర్శకుడు.