అతిలోక సుందరి శ్రీదేవి కి హేమ డూప్ గా నటించారని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

అతిలోక సుందరి శ్రీదేవి కి హేమ డూప్ గా నటించారని తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

by Anudeep

Ads

టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి కి హేమ డూప్ గా నటించారన్న సంగతి చాలా మందికి తెలియదు. సినిమాలలో కొన్ని సీన్లలో అవసరం అయిన చోట డూప్ లను కూడా తీసుకురావడం చూస్తూనే ఉంటాం. ఎక్కువ గా ఫైట్ సీన్లలో హీరోలకు డూప్ లను తీసుకొస్తూ ఉంటారు. అయితే.. హీరోయిన్ శ్రీదేవి కి డూప్ ఎందుకు అవసరం అయ్యారో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

hema 1

అవసరం అయితే డూప్ తో చేయించే ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. ఎన్టీఆర్ కు కూడా సత్యనారాయణ కొన్ని సీన్లలో డూప్ గా చేసారు. ఇద్దరు కొంచం పర్సనాలిటీ విషయం లో ఒకేలా ఉంటారు కాబట్టి ఆరోజుల్లోనే సత్యనారాయణ ఎన్టీఆర్ కి డూప్ గా ఫేమస్ అయిపోయారు. ఆ తరువాత నాగార్జున హలో బ్రదర్ సినిమా లో కూడా అక్కినేని నాగ్ కి శ్రీకాంత్ డూప్ గా నటించారు. ఇలా చాలా చోట్ల అవసరం వస్తూనే ఉండేది.

sridevi

ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వం లో చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లు గా “జగదేకవీరుడు – అతిలోక సుందరి” సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ సన్నివేశం లో శ్రీదేవి స్విమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ.. శ్రీదేవి కి ఈత రాదు. అందుకే.. ఈత వచ్చిన మరొక అమ్మాయి కోసం వెతికారు. ఆ క్రమం లో నే హేమ పేరు వినిపించగా… ఆమె చేత ఆ సన్నివేశం లో నటింపచేసారు. అదన్నమాట సంగతి.


End of Article

You may also like