మంచు విష్ణు పక్కన ఉన్న ఈమె ఆ హీరోయిన్ కి చెల్లి అని మీకు తెలుసా..?

మంచు విష్ణు పక్కన ఉన్న ఈమె ఆ హీరోయిన్ కి చెల్లి అని మీకు తెలుసా..?

by kavitha

Ads

హీరో మంచు విష్ణు గత ఏడాది జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి, ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ ప్లాప్ అవడంతో అప్పటి నుండి  సినిమాలకు దూరంగా ఉన్న మంచు విష్ణు ఇటీవల తన కలల ప్రాజెక్ట్ ను ప్రకటించారు.

Video Advertisement

ఎన్నో ఏళ్ల నుండి విష్ణు తెరకెక్కించాలనుకుంటున్న కన్నప్ప మూవీని రీసెంట్ పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నుపుర్ సనన్ నటిస్తోంది. అయితే ఆమె స్టార్ హీరోయిన్ చెల్లి అని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హీరో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని  ముఖేశ్ కుమార్ సింగ్ తెరకేకిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్న విష్ణు, ఫైనల్ గా ఈ మూవీని ప్రకటించారు. అలాగే శ్రీ కాళహస్తిలో ప్రారంభించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో మంచు విష్ణు పక్కన హీరోయిన్ గా నుపుర్ సనన్ నటిస్తోంది. ఈమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సోదరి. నుపుర్ సనన్ బాలీవుడ్ లో నటి మరియు సింగర్. ఆమె ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజీలో  కామర్స్‌ పూర్తి చేసింది. ఆమె తన అక్క కృతి సనన్ అడుగుజాడల్లో నడవడానికి ముంబైకి మారింది. అక్షయ్ కుమార్ సరసన బి ప్రాక్: బి ప్రాక్: ఫిల్హాల్ అనే మ్యూజిక్ వీడియోలో నటించి, గుర్తింపు తెచ్చుకుంది.
గత ఏడాది వచ్చిన కునాల్ కెమ్ము, సౌరభ్ శుక్లా నటించిన కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ పాప్ కౌన్ తో ఆమె నటిగా మారింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన నూరానీ చెహ్రా మూవీలో నటిస్తోంది. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమె మొదటి తెలుగు మూవీ.

https://www.instagram.com/p/CqFMyeEIUdW/

Also Read: “మీరు ఇలా అనడం ఏంటి..?” అంటూ… “ప్రకాష్ రాజ్” పై ఫైర్ అవుతున్న నెటిజెన్స్..! విషయం ఏంటంటే..?

 


End of Article

You may also like